రాష్ట్రీయం

టెక్నాలజీలో దూసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కాగితం అవసరం లేని పాలనా వ్యవస్థ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నుంచి వివిధ శాఖల్లో ఈ-ప్రగతిని పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో భూ-సేవ, ఈ-ప్రగతిపై మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వివాహ నమోదు పత్రాలు, భూసార పరీక్షల కార్డులు, కులధృవీకరణ పత్రాలు ఇకపై ఆన్‌లైన్‌లో జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నుంచి వివిధ శాఖల్లో దశలవారీగా ఈ-ప్రగతిని అమలు చేయాలన్నారు. ఈ పథకాన్ని ఈ-పథకం పేరుతో ప్రతి దశలో ట్రాకింగ్ చేయాలన్నారు. విద్యాశాఖలో పూర్తిస్థాయిలో ఈ-ప్రగతిని ప్రవేశపెట్టాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా సంస్థల నమోదు, కొత్త విద్యా సంస్థల ఏర్పాట్లకు అనుమతులు, విద్యార్థులకు వివిధ సర్ట్ఫికెట్ల జారీ, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి గృహాలు వంటి అంశాలను దీని పరిధిలోకి తీసుకురావాలన్నారు. దేశంలోనే తొలిసారిగా భూకమతాలకు సంబంధించిన
వివిధ అంశాలను భూసేవ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకువచ్చామని తెలిపారు. భూ సంబంధిత సేవలు సులభతరం చేసేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టామన్నారు. ప్రతి భూకమతానికి పదకొండు అంకెల విశిష్ఠ సంఖ్యను భూదార్ పేరుతో కేటాయించనున్నట్లు తెలిపారు. భూములకు సంబంధించిన 20 రకాల సేవలు మే 30 నాటికి కృష్ణా జిల్లా అంతటా, అక్టోబర్ 2కు రాష్ట్రం అంతటా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పైసా దుర్వినియోగం కాకుండా నీతివంతమైన పాలన అందించడమే తమ ధ్యేయమని తెలిపారు. భూములు కొన్నా, విక్రయించినా ఆటోమాటిక్‌గా లావాదేవీలు జరుగుతాయన్నారు. గతంలో మాదిరి ఆఫీసులకు వెళ్లి ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి భవిష్యత్‌లో ఉండదన్నారు. రానున్న కాలంలో ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు టెక్నాలజీ సహకరిస్తుందన్నారు. టెక్నాలజీ సాయంతో తమ భూమి రికార్డులు టాంపర్ కాకుండా భద్రంగా ఉంటాయన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు వలన రాష్ట్రానికి ఖ్యాతి వస్తుందన్నారు. ఈ-ప్రగతి పోర్టల్ ద్వారా పంచాయతీ రాజ్, రహదారులు భవనాల శాఖలో ఎంబుక్, ఆర్థిక సేవలు,
పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో 10 లక్షల మంది విద్యార్థుల అడ్మిషన్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో 25 వేల మంది వ్యాపారులకు లైసెన్సుల జారీ వంటి సేవలను ఈ-ప్రగతి పోర్టల్‌కు అనుసంధానం చేస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.