రాష్ట్రీయం

ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ 20న ధర్మపోరాట దీక్ష పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఒకరోజు నిరసన దీక్ష చేయనున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ దీక్షలో పాల్గొంటున్నారన్నారు. 68 ఏళ్ల వయస్సులో సీఎం చంద్రబాబునాయుడు చేపడుతున్న ఈ సాహస కార్యక్రమానికి రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజలు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మపోరాట దీక్ష కార్యక్రమం విజయవంతానికి వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో పలు శాఖలకు చెందిన అధికారులతో మంత్రులు లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రతో కూడిన ఉప సంఘం మంగళవారం భేటీ అయింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ధర్మ పోరాట దీక్ష నిర్వహణకు ఆయా శాఖల అధికారులకు మంత్రుల ఉప సంఘం దిశా నిర్దేశం చేసింది. ముందుగా ఉప సంఘం అధ్యక్షుడు కళా మాట్లాడుతూ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం చంద్రబాబునాయుడు ఒక రోజు నిరాహారదీక్ష చేయనున్నారన్నారు. ఈ దీక్ష ఏర్పాట్ల బాధ్యతలను కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంకు అప్పగించారు. పలు పార్టీల నేతలు, అఖిలపక్ష నేతలు హాజరుకానున్నారని, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండు వేదికలు ఏర్పాటు చేయాలని, ఒకదానిపై సీఎం దీక్ష కోసం, మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రధాన వేదికపై 150 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని, వేదిక ఎదురుగా 10వేల మంది సభికులు ఆశీనులయ్యేలా కుర్చీలు వేయాలన్నారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ ధర్మపోరాట దీక్షకు అన్ని పార్టీల నేతలనూ, అఖిలపక్ష నేతలనూ ఆహ్వానిస్తున్నామన్నారు. వారితో పాటు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళా సంఘాలు, వాణిజ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్లు, రిక్షా, ఆటో యూనియన్లు, విద్యార్థి సంఘాలతో పాటు డాక్టర్లు, ఇలా అన్ని వర్గాల ప్రతినిధులకూ దీక్షలో పాల్గొనాలంటూ లేఖలు రాయనున్నామన్నారు. పునర్విభజన చట్టం అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు విజయభాస్కర్‌ను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపైనా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉండాలన్నారు. ప్రత్యేక గీతాలతో కూడిన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. ధర్మపోరాట దీక్షకు సంబంధించి విశేష ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్లును మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించాలని అన్నారు. 68ఏళ్ల వయసులో సాహస దీక్ష చేస్తున్నారని, అదే సమయంలో ఢిల్లీలో కదలిక రావాలని ఈ పవిత్ర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని అన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దీక్షకు తరలివచ్చే వారి కోసం తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు.