రాష్ట్రీయం

కేరాఫ్ కర్నాటక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఏప్రిల్ 17: నల్లధనం, తెల్లధనం మొత్తం ఇప్పుడు కర్నాటకలోనే ఉందని బ్యాంకింగ్ రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు నగదు కొరత ఎదురుకాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఆ రాష్ట్రానికి పంపాల్సిన కరెన్సీ కంటే ఎక్కువగా కేటాయిస్తుండటం, ఎన్నికల ఖర్చు కోసం నల్లధనాన్ని అక్రమార్కులు అదే రాష్ట్రానికి తరలించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత ఏర్పడిందని వారు వివరిస్తున్నారు. గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగదు కొరతను ప్రజలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులకు అనుసంధానంగా ఉన్న ఎటీఎంలలో ‘నో క్యాష్’ బోర్డులు కనిపింస్తున్నాయ. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంకుకు నగదు కొరత విషయాన్ని లేఖల ద్వారా తెలియజేశాయి. రెండు రాష్ట్రాల్లో జనవరి చివరి వారం నగదు సమస్య ప్రారంభమై ఫిబ్రవరి రెండవ వారం నుంచి సామాన్యుడిని ఇబ్బంది పెట్టే స్థాయికి చేరుకుందని బ్యాంకింగ్ రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు. కర్నాటకలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్న కారణంగా బ్యాంకులకు ఎక్కువ నిధులను రిజర్వ్ బ్యాంకు తరలిస్తోందని వారంటున్నారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కోత విధించడం గమనార్హమంటున్నారు. కరెన్సీ కష్టాలు కన్నడిగులకు ఎదురుకాకుండా ఉండటం కోసం బ్యాంకు కౌంటర్లు, ఎటీఎంలలో కొరత లేకుండా జాగ్రత్త పడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ప్రభుత్వ ఖాతాలతో పాటు అభ్యర్థుల ఖాతాలకు చెందిన వారు ఎంత నగదు ఉప సంహరించుకున్నా ఇబ్బంది లేని విధంగా కర్నాటకలో ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్నికల ఖర్చు కోసం భారీ ఎత్తున నల్లధనం కూడా కర్నాటకకే తరలడంతో కరెన్సీ కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయని వారంటున్నారు. ప్రధానంగా గుజరాత్, మహారాష్టక్రు చెందిన వ్యాపారులు హైదరాబాదు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నారు. తమ అవసరాలు పోను మిగిలిన మొత్తంలో ఎక్కువ భాగం బ్యాంకుల్లో నిల్వ ఉంచుకుంటారని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. కర్నాటకలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ సొమ్మును ఉప సంహరించుకుని కర్నాటకకు తరలించినట్లు తెలిపారు. కర్నాటకలో ఎన్నికల వ్యాపారం కోసం పెట్టుబడులు, వడ్డీ వ్యాపారం, ఇతర అవసరాలకు భారీ ఎత్తున నగదును తరలించడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో నగదు చెలామణి తగ్గిపోయిందని స్పష్టం చేస్తున్నారు. కర్నాటకలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాతే తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరత తీరుతుందని స్పష్టం చేస్తున్నారు.