రాష్ట్రీయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 17: గడచిన నాలుగేళ్లుగా బీజేపీ నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ పొత్తు తెగదెంపులు చేసుకోవటంతో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు సోమవారం రాత్రి తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నేరుగా ఈ లేఖ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అందిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమోదించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రెండురోజుల్లో సీఎం చంద్రబాబు..
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన దీక్షకు దిగుతున్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంపై ఎదురు దాడికి ఒక కన్వీనర్, మరో ఐదుగురు సభ్యులతో ఏ క్షణాన్నైనా అడ్‌హాక్ కమిటీని బీజేపీ నాయకత్వం ప్రకటించబోతున్నది. త్వరలో రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యే వ్యక్తినే ఈ కమిటీని కన్వీనర్‌గా నియమించాలని పార్టీ అధిష్ఠానం కూడా ఆలోచిస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం కాపు వర్గం నుంచి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కమ్మ వర్గం నుంచి మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి రేస్‌లో నిలిచారు. దేశం మొత్తంపై ప్రస్తుతం ఒక్క తమిళనాడులోనే ఒక మహిళ బీజేపీకి అధ్యక్షురాలిగా పనిచేస్తుండగా ఏపీకి కూడా మహిళను నియమించాలనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా నాలుగేళ్లుగా అధ్యక్షుడుగా కొనసాగుతున్న హరిబాబు తనకంటూ సొంత కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి ఏర్పాటుచేసిన కార్యవర్గంలోని ఏపీకి చెందిన ఆఫీస్ బేరర్లు మాత్రమే నేటికీ కొనసాగుతున్నారు.