రాష్ట్రీయం

ఖాళీ అవుతున్న కృష్ణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: వేసవి ప్రారంభమవడంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తాగు నీటికోసం కృష్ణాపై ఆధారపడిన 30 పట్టణాలు, వేలాది గ్రామాల్లో కటకట కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలకు ప్రాణాధారమైన కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్రమేపీ అడుగంటుతున్నాయ. ఈ రెండు రిజర్వాయర్లలో నీటి లభ్యతతో వచ్చే నాలుగు నెలలు రెండు ప్రభుత్వాలు నెట్టుకు రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం శ్రీశైలంలో 885 అడుగుల నీటి మట్టానికి 802.5 అడుగుల వద్ద 30.23 టిఎంసి జలాలున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 590 అడుగుల నీటి మట్టానికి 513 అడుగుల నీటి మట్టం వద్ద 136 టిఎంసి జలాలున్నాయి. రెండు రిజర్వాయర్లు కలిపి 166 టిఎంసి చూపిస్తున్నాయ. జూన్ వరకూ కనీస నీటి మట్టం కొనసాగించాలని కృష్ణాబోర్డు ఇప్పటికే రెండు రాష్ట్రాలను కోరింది. కానీ నీటి లభ్యత డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. జూలై నెలల్లో రుతుపవనాలు వచ్చినా కృష్ణా నది పరీవాహక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి మహారాష్ట్ర, కర్నాటకలోని ప్రాజెక్టులు నిండిన తర్వాత కానీ దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పటిలాగానే సెప్టెంబర్, అక్టోబర్‌కు పైప్రాజెక్టులు నిండి దిగువకు నీరు వదిలితే తప్ప ధైర్యంగా ఉండలేని పరిస్థితి. తెలంగాణలో కృష్ణా నది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండటంతో, దీన్ని దృష్టిలో పెట్టుకుని నీటి కేటాయింపులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదే పదే కోరింది. కానీ కేంద్రం మాత్రం జనాభా నిష్పత్తి ప్రకారం లభ్యతలోని నీటిలో 37శాతం తెలంగాణకు, 63 శాతం ఆంధ్రకు కేటాయింపులు కొనసాగుతాయని ఇటీవల స్పష్టం చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేంతవరకూ కృష్ణా నదీ జలాల కేటాయింపునకు సంబంధించి యదాతథ స్థితి కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇదిలావుంటే, లభ్యతలో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల వేసవి అవసరాల నిమిత్తం కేటాయించడం కృష్ణాబోర్డుకు కత్తిమీద సామే.
రెండు రాష్ట్రాల్లో కృష్ణా నది నీటిపై ఆధారపడి 30 పట్టణాలున్నాయి. పాత నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు తెలంగాణలో, ఆంధ్రలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలు కృష్ణా నది నీటిపై ఆధారపడి ఉన్నాయి. వచ్చే మే నెలకు నీటి కేటాయింపులకు సంబంధించి ఈ నెలాఖరులోపల కృష్ణాబోర్డు సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, శంషాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్లకు నీటి ఎద్దడిని నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.