రాష్ట్రీయం

మహాయజ్ఞం.. కాళేశ్వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రపంచ రికార్డు దిశగా పనుల పరుగులు * మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణలో పూర్వపు 10 ఉమ్మడి జిల్లాల్లో ఒక్క మహబూబ్‌నగర్ మినహా మిగతా 8 జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన బహుళార్ధక సాధక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాతీయ రికార్డును ఇప్పటికే అధిగమించి ప్రపంచ రికార్డుకు చేరువలో రాత్రింబవుళ్లు మూడు షిఫ్టుల్లో శరవేగంగా కొనసాగుతోన్న పనులు కేంద్ర జల సంఘం నిపుణులను నివ్వెర పరుస్తోదంటే అతిశయోక్తి కానేకాదు. ఇది వాస్తవ దృశ్యం. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం నిపుణులు నీటిపారుదల రంగంలో దీనిని ఒక రోల్ మాడల్‌గా అభివర్ణించి వెళ్లారు. ఒకవైపు ఇంజనీరింగ్ నిపుణులు, మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి ప్రాజెక్టు సందర్శనకు తరలివస్తోన్న ప్రతినిధులతో ప్రస్తుతం ఇదొక పర్యాటక ప్రాంతంగా సందర్శకులతో కిటకిటలాడిపోతుంది. దీంతో పర్యాటకశాఖ ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఒక ప్యాకేజిని తాజాగా మంగళవారమే ప్రకటించడం విశేషం. తెలంగాణలో దాదాపు 60 శాతం సాగుభూమికి నీరు అందించే లక్ష్యంతో 26 ప్యాకేజీలలో ఏకకాలంలో కొనసాగుతోన్న నిర్మాణ పనుల్లో 45 వేల మంది కార్మికులు పాల్గొనడం
నిజంగా ఇదొక మహాయజ్ఞమే. రోజుకు 57 వేల బస్తాల సిమెంట్ వినియోగంతో 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరుగుతున్నాయి. సాగునీటిరంగం ఒక్కటే కాకుండా ఇతర నిర్మాణ రంగాలలో కూడా ఇప్పటి వరకు ఎక్కడా 4 వేల క్యూబిక్ మీటర్లకు మించి కాంక్రీటు పనులు జరగకపోవడం జాతీయ రికార్డు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజి వద్ద ఒకేరోజు 7 వేల క్యూబిక్ మీటర్ల పని జరగడం జాతీయ రికార్డును అధిగమించి ప్రపంచ రికార్డుకు చేరువలో ఉందని 45 దేశాలలో భారీ నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టి సంస్థ సగర్వంగా ప్రకటించింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని ప్యాకేజీలలో కలిపి 21 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ రికార్డు 21 వేల 589 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పని దుబాయిలో నమోదు అయింది. ఈ రికార్డును త్వరలోనే అధిగమించబోతున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేసారు. మొత్తంగా 26 ప్యాకేజిలలో 218 కిలో మీటర్ల పొడవున సొరంగ కాలువలు, 1531 కిలో మీటర్ల పొడవున కాలువలు, 98 కిలో మీటర్ల ప్రెషర్ పైపులైన్, 19 లిఫ్టులు, 20 పంపు హౌజ్‌లు, 20 జలాశయాలు, 142 టిఎంసిల నీటి నిలువ సామర్ధ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు త్వరితగతిన అందుబాటులోకి రాబోతుంది. వర్షకాలం ప్రారంభమయ్యే నాటికే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు మంచినీటిని అందించే లక్ష్యంగా కొనసాగుతోన్న నిర్మాణ పనులపై మంగళవారం జలసౌధలో మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రి హరీశ్‌రావు వివరించారు.