రాష్ట్రీయం

10 నుంచే రైతుకు పెట్టుబడి చెక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: రైతుబంధు పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడిగా ఎకరానికి రూ. 8 వేల చొప్పున అందించనున్న ఆర్థిక సహాయంలో మొదటి విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల మే 10వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అదే రోజు చెక్కులతో పాటు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు. మొదటి విడతలో వర్షాకాలపు పంట కోసం ఎకరానికి రూ. 4 వేలు, రెండో విడతగా ఎండాకాలపు పంట కోసం మరో రూ. 4 వేలు అందించనున్నట్టు వివరించారు. రైతులు చెక్కులను బ్యాంకుల్లో మార్చుకోవడానికి నగదు కొరత తలెత్తకుండా బ్యాంకర్లతో ఇప్పటికే చర్చించినట్టు పేర్కొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యాచరణను రూపొందించడానికి ఈనెల 21న ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో మంగళవారం మంత్రులు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డితో పాటు రెవిన్యూ, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో చెక్కుల పంపిణీ, పాసు పుస్తకాల పంపిణీకి కార్యాచరణను సీఎం ఖరారు చేశారు. మొత్తం 10,323 గ్రామాల్లో పంపిణీ చేయాల్సిన పాసు పుస్తకాలు, చెక్కులు 58 లక్షలుగా వెల్లడించారు. ప్రతీ రోజు 8,25,571 పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేస్తారు. వీటిని పంపిణీ చేయడానికి 2762 బృందాలు ఏర్పాటు చేయగా, ఒక్కో రోజు 1546 గ్రామాలలో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సిఎం ఆదేశించారు. మే 10న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనప్రాయంగా చెక్కులు, పాసు పుస్తకాలు పంపిణీ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారు, అదే రోజు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రెవిన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, భూ పరిపాలనశాఖ డైరెక్టర్ వాకాటి కరుణతో కూడిన బృందాలు ప్రతీ రోజు నాలుగు జిల్లాల్లో పర్యటించి పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలక్టర్లు పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించనుండగా వారికి అవగాహన కల్పించడానికి ఈ నెల 21న ప్రగతి భవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సిఎం వివరించారు. రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులను కూడా ప్రగతి భవన్‌లో జరిగే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. రైతులకు పాసు పుస్తకాలు, చెక్కులు ఇచ్చి సంతకాలు తీసుకోవాలని, సంబంధిత రైతులు అందుబాటులో లేనిపక్షంలో వాటిని మండల కార్యాలయాల్లో మూడు నెలల పాటు ఉంచుతామని సిఎం కేసీఆర్ తెలిపారు.