రాష్ట్రీయం

వేటుపై వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు * కాంగ్రెస్‌లో ఆనందోత్సాహాలు * ప్రభుత్వానికి చెంపపెట్టు: కాంగ్రెస్
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించి, సభ్యత్వాన్ని రద్దుచేస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానం చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వంపై తలెత్తిన వివాదం కేసులో మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర్ తీర్పునిచ్చారు. తమ అసెంబ్లీ సభ్యత్వం రద్దుచేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ ముగించింది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగావున్న అసెంబ్లీ తీర్మానాన్ని తోసిపుచ్చుతున్నట్టు హైకోర్టు వెల్లడించింది. అదే సమయంలో అలంపూర్, నల్లగొండ సెగ్మెంట్లు ఖాళీఅయినట్టు సర్కారు జారీచేసిన నోటిఫికేషన్‌ను సైతం హైకోర్టు నిలుపుదల చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేలు తమ కాలపరిమితి పూర్తయ్యేవరకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ తీర్పుతో పిటీషనర్ల సభ్యత్వం సహజంగా
పునరుద్ధరించినట్టేనని, నల్లగొండ, అలంపూర్ నుంచి ఎన్నికైన వీరు నిర్దేశిత కాలపరిమితి వరకూ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా కొనసాగవచ్చని తన తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇయర్ ఫోన్లను కౌన్సిల్ చైర్మన్‌పై విసిరినట్టు వచ్చిన ఆరోపణలకు సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకున్నా, చర్యలకు ఉపక్రమించినా చట్టానికి ఎలాంటి అడ్డంకులూ ఉండవని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మార్చి 15న ఇద్దరు ఎమ్మెల్యేలు సభలో రగడ సృష్టించి కౌన్సిల్ చైర్మన్‌కు గాయపర్చారన్న ఆరోపణలు వచ్చాయి. అదేరోజు ఇద్దరు ఎమ్మెల్యేలను సభనుంచి బహిష్కరించి, అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. అదేరోజు అసెంబ్లీ సచివాలయం కూడా నల్లగొండ, అలంపూర్ సెగ్మెంట్లు ఖాళీ అయినట్టు నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. తమపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు లేదని పిటీషన్‌లో పేర్కొన్నారు. అసెంబ్లీ నిబంధనల రూల్ 17కు విరుద్ధంగా వ్యవహరించారని, రాజ్యాంగంలోని 175, 176 అధికరణలను ఉల్లంఘించారని పిటీషన్‌లో పేర్కొన్నారు. వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ నుంచి బహిష్కరించారని, ఆరోపణలపై విచారణకు కమిటీని సైతం నియమించలేదని పిటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై వీడియో ఫుటేజిని ఇవ్వాలని కోర్టు ద్వారా కోరామన్నారు. కానీ అసెంబ్లీ కార్యదర్శి వీడియో ఫుటేజీ సమర్పించలేదని కోర్టుకు వివరించారు. పిటీషన్లను విచారించిన హైకోర్టు, నియోజకవర్గాల ఖాళీ నోటిఫికేషన్‌పై మార్చి 19న స్టే ఇచ్చింది. దీనిపై కోర్టు వ్యాఖ్యానిస్తూ సహజ న్యాయ సూత్రాలకు తూట్లు పొడిచిన సందర్భంలో ఉన్నత న్యాయస్థానాలు న్యాయ సమీక్ష చేసి జోక్యం చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటాయని పేర్కొంది. గవర్నర్ ప్రసంగం కూడా బిజినెస్ ఆఫ్ హౌస్ పరిధిలోకి రాదన్న పిటీషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. కాగా వీడియో ఫుటేజీని సమర్పిస్తానన్న హామీని నిలబెట్టుకోలేనందుకు మార్చి 19న అడ్వకేట్ జనరల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విధితమే.