రాష్ట్రీయం

బోర్డు పరీక్షల సంస్కరణలకు సీబీఎస్‌ఈ జాతీయ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 17: దేశవ్యాప్తంగా పాఠశాల, ఉన్నత పాఠశాల, ప్లస్ టు స్థా యి వరకూ నిర్వహించే బోర్డు పరీక్షల సంస్కరణలకు సీబీఎస్‌ఈ జాతీయ కమిటీని నియమించింది. ఈ కమిటీ మే 31 నాటికి తొలి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ప్రాతిపదికగా కొన్ని సంస్కరణలకు సీబీఎస్‌ఈ నడుం బిగిస్తోంది. ఇవే సంస్కరణలను రాష్ట్రాలకు సైతం సిఫార్సు చేసి వా టి అమలుకు సూచనలు చేయనుంది. ఉ న్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన వినయ్ షీల్ ఒబురాయ్ కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో సీబీఎస్‌ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచేసి న పవనీష్‌కుమార్, యునెస్కో ఎగ్జిక్యూటీవ్ బోర్డు భారతీయ ప్రతినిధి ప్రొఫెసర్ జె ఎస్ రాజ్‌పుత్, ఎస్‌ఎన్‌డీటీ మాజీ వీసీ ప్రొ. వసుధ కామత్, యూపీ ఇంటర్మీడియట్ బోర్డు మాజీ సంచాలకుడు ప్రొ.కృష్ణ మోహన్ త్రిపాఠీ, ఎన్‌ఐసీ డీజీ, పాఠశాల విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీ లో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుత పరీక్షల విధానాన్ని సమీక్షించడంతో పాటు ప్రశ్నాపత్రాల లీక్‌ను అరికట్టేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా కమిటీ సూచిస్తుంది.

ఎమ్సెట్‌కు తగ్గిన అభ్యర్థులు
ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీంకు 71,367 మం ది, ఇంజనీరింగ్ స్ట్రీంకు 1,45,930 మంది దరఖాస్తు చేశారు. అదే గత ఏడాది చూస్తే అగ్రికల్చర్‌కు 79,033 మంది, ఇంజినీరింగ్‌లో 1,41,136 మంది దరఖాస్తు చేశారు. 2017లో ఇంజినీరింగ్ స్ట్రీంకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్ స్ట్రీంకు 154 కేంద్రా లు ఏర్పాటు చేశారు. గత ఏడాది పరీక్ష ఒకే రోజు జరిగింది. ఈసారి మాత్రం అగ్రికల్చర్ స్ట్రీంకు రెండు రోజులు, ఇంజినీరింగ్ స్ట్రీంకు మూడు రోజులు కలిపి ఒక్కో రోజు రెండు స్లాట్‌లు చొప్పున 10 స్లాట్‌లను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్‌కు గరిష్టంగా 28397 మంది, అగ్రికల్చర్ స్ట్రీంలో గరిష్టం గా 6100 మందిని పరిగణిస్తారు. ఈ లెక్క న చూసుకున్నా మూడు స్లాట్‌లలో అగ్రికల్చర్ విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష పూర్తి చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే మూడు రోజుల పాటు ఇంజినీరింగ్‌కు మే 4,5,7 తేదీల్లో ఆరు స్లాట్‌లలో పరీక్ష నిర్వహిస్తారు.
మే 6న నీట్ పరీక్ష ఉండటంతో ఈ సర్దుబాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రం లో ఒక టెక్నికల్ కమిటీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క మిటీ ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా అప్పటికపుడు వాటిని పరిష్కరిస్తుంది.