రాష్ట్రీయం

హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 17: కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను రద్దుచేస్తూ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం చెల్లదని పేర్కొంటూ, శాసన సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంపపెట్టు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్య త్వం రద్దుపై హైకోర్టు తీర్పు తరువాత మంగళవారం ఖమ్మంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ కోర్టు తీర్పుకు నైతిక బాధ్యత వహిం చి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాసన సభ్యత్వాలను రద్దుచేయడంతో తాము ఎంతో మనస్తాపానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పుతో ముఖ్యమంత్రి తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డాడన్నారు. నియంతృత్వంగా వ్యవహరిస్తూ, అప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. చివరి బడ్జెట్ సమావేశాల్లో ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామనే భయంతోనే నియంతృత్వంగా పోలీసులతో అసెంబ్లీ నుండి గెంటివేశారన్నారు. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. కోర్టు తీర్పుతో మరింత ఉత్సాహంగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు కోర్టులు బుద్ధి చెప్పినట్లే 2019ఎన్నికల్లో కూడా ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. తమకు అండగా ఉన్న రాహుల్‌గాంధీకి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, అడ్వకేట్ రవిశంకర్‌కు ఈ సందర్భంగా కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సొంత రాజ్యాంగం చెల్లదు
ఖమ్మం, ఏప్రిల్ 17: దేశంలో బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే చెల్లుతుందని, కేసీఆర్ సొం త రాజ్యాంగం చెల్లదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా మణుగూరులో మంగళవారం జరిగిన ప్రజా చైతన్యయాత్రలో ఆయన మాట్లాడా రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాల రద్దు పై హైకోర్టు తీర్పు కేసీఆర్ రాక్షసపాలనకు చెంపపెట్టు అని అన్నారు. ఎవరైనా సరే రాజ్యాంగాని కి అనుగుణంగా వ్యహరించాల్సిందేనని, సొంత నిర్ణయాలతో వ్యవహరిస్తే తగిన గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై ప్రజలలో అవగాహన కల్పించి చైతన్యవంతం చేసేందుకే యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి చేపట్టిన కొన్ని పథకాలతో ప్ర జలకు ఒరిగేది ఏమీలేదన్నారు. నిరుద్యోగులకు నెలకు 3వేలు నిరుద్యోగభృతి కల్పిస్తామని, డ్వా క్రా మహిళలకు వడ్డీలేని రుణం పదిలక్షలు ఇస్తామని, అపరాలకు మద్దతు ధరతో పాటు మిర్చికి పదివేలకుపైగా గిట్టుబాటు ధర కల్పిస్తామని హా మీ ఇచ్చిన ప్రభుత్వం వాటిని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే రైతులకు రూ.2లక్షల రుణమాఫీని ఒకేదఫా చేస్తామన్నారు. యూపీఏ పాలనలో రూ. 36వేల కోట్ల రైతు రుణమాఫీని ఒకేసారి చేసిందని ఉత్తమ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ రాష్టన్రేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వందకోట్లకు అమ్ముడుపోయాడని, ఆయనని వందమీటర్ల గోతిలో పాతిపెట్టాలన్నారు. రైతులు దొంగలు, నక్సలైట్లు కాదని అటువంటి వారికి సంకెళ్ళు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలులేక ఆందోళన చెందుతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి మాయమాటలతో వారిని మభ్యపెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పాలించే అర్హత కోల్పోయారని, అటువంటి వారిని గద్దె దించాలని రేవంత్ అన్నారు.