రాష్ట్రీయం

దేవుడా.. ఏమిటీ దుస్థితి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: దేవాదాయ శాఖను ‘దేవుడు’ కరుణించినట్టు కనిపించటం లేదు. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఐఏఎస్ అధికారి బి వెంకటేశ్వర్లు కొంతకాలం కమిషనర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత నుంచీ ఇన్‌చార్జిలతోనే పాలన కాలయాపన అవుతోంది. ఆర్థిక, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శివశంకర్ దేవాదాయ శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. శివశంకర్ ఆర్థిక వ్యవహారాల ముఖ్యకార్యదర్శి బాధ్యతలతోనే తీరికలేకుండా ఉన్నారు. రెవెన్యూ శాఖ (ఎండోమెంట్స్) ముఖ్యకార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో రెవెన్యూ బాధ్యతలూ ఆయనకు అధికమయ్యాయ. దాదాపు రెండేళ్ల నుంచీ ఇదే పరిస్థితి. దీనికితోడు ఎండోమెంట్ విభాగంలో ఖాళీలు ఎక్కువగా ఉండటంతో దేవాదాయ, ధర్మాదాయ పరిపాలన అధికశాతం రెవెన్యూ శాఖ ఆధీనంలో నడుస్తోంది. తెలంగాణలో ప్రధాన దేవాలయాలైన భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం (్భద్రాద్రి), యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం (యాదాద్రి), బాసర శ్రీ సరస్వతీ ఆలయం, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ అధికారులు (ఈవోలుగా) రెవెన్యూ శాఖ అధికారులనే డిప్యుటేషన్‌పై నియమించారు. వాస్తవంగా దేవాలయాల ఈవోలుగా ఎండోమెంట్స్‌కు చెందిన అధికారులనే నియమించాల్సి ఉంటుంది. ఎండోమెంట్స్ ఉన్నతస్థానంలో డిపార్ట్‌మెంట్ అధికారులు లేకపోవడంతో కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా దేవాలయాల హోదాను (ఆదాయాన్ని) బట్టి జాయింట్ కమినర్, డిప్యూటీ కమిషనర్, ఆడిషనల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లను ఈఓలుగా నియమించాలి. దేవాదాయ శాఖలో సిబ్బంది లేకపోవడంతో రెవెన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై నియామకాలను చేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 వేలకు పైగా దేవాలయాలు ఉండగా, 645 ఆలయాలు (6ఏ, 6బీ, 6సీ క్యాటగిరీ) దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. దాదాపు 300లకుపైగా ఈవో తదితర పోస్టులుంటే, వీటిలో సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ఈవో క్యాడర్ మొదలుకుని ఉన్నతస్థాయి వరకు పోస్టుల భర్తీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా చేయాల్సి ఉంది. దేవాదాయ శాఖ నుండి ఖాళీ పోస్టుల వివరాలు టీఎస్‌పీఎస్‌సీకి పంపించి రెండేళ్లయినా భర్తీ జరగలేదు. గత ఏడాది జనవరిలో 77 ఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌జారీ అయినప్పటికీ, పోస్టుల భర్తీ మాత్రం జరగలేదు. పరిపాలనాపరమైన అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే ఎండోమెంట్స్ నుంచి వివరాలు అందిన ఆరు నెలల్లోగా పోస్టులను భర్తీ చేయడానికి పీఎస్‌సీకి వీలుంది. ఈవోల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండటం వల్ల ఒక్కో ఈవోకు నాలుగైదు దేవాలయాలు అప్పచెప్పారు. దాంతో ఉన్న ఈవోలపై పనిభారం పెరిగి ఏ దేవాలయానికీ వీరు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయి కమిషనర్‌ను నియమిస్తే పరిపాలన గాడిలో పడుతుందని అంటున్నారు. ఈ శాఖ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెంటనే ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాదాయ శాఖ పరిస్థితి బాగుపడాలంటే ‘దేవుడు’ దిగిరావాలేమో.