రాష్ట్రీయం

మోసకారి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 18: సీఎం కేసీఆర్ మోసకారి, అబద్దాల కోరంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మలివిడత ప్రజా చైతన్య బస్సు యాత్ర ముగింపు సందర్భంగా బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో బుధవారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు నక్సల్స్ అజెండాయే మా అజెండా అని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి రాగానే నక్సలైట్లను అణిచివేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే తొలి సీఎం అన్న కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చినట్లయితే దళిత గిరిజనులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇంత వరకు ఏ ఒక్కరికీ కూడా ఇవ్వలేదని అన్నారు. అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానన్న ముఖ్యమంత్రి ఎక్కడా కూడా అ పనులు పునాది దాటలేదని అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నేరవేర్చని సీఎం కేసీఆర్ అసమర్థుడని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఊదరగొట్టిన ఆయన.. కనీసం ఊరుకో ఉద్యోగం అయిన ఇచ్చాడా? అంటూ పశ్నించారు. టీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రంలో దొంగల ముఠాగా ఏర్పడి అందినంత దోచుకుంటూ తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని అన్నారు. గత నాలుగేళ్లుగా సీఎం కేసీఆర్ రాక్షస పాలనపై ప్రజలు విసిగి పోయారని అన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలు కష్టాలు తీరుతాయని అన్నారు. అధికారంలో రాగానే ములుగును సమక్కసారలమ్మ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అన్నారన్నారు. అదే విధంగా మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. పోడు రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. ఎజెన్సీ ప్రాంత ప్రత్యేక అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అధికారంలో రాగానే బిల్ట్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 6లక్షల మహిళ సంఘాలకు 10 లక్షల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తామని అన్నారు. తెలంగాణలో ఉన్న 75 లక్షల మహిళ సంఘాలకు లక్ష రూపాయల ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మహిళా సంఘానికి పది లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. అభయ హస్తాన్ని 500 నుండి వెయ్య రూపాయలకు పెంచుతానని తెలిపారు. అదేవిధంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వరికి రెండువేల మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేస్తామని, పత్తికి 6000, మిర్చి, పసుపునకు పదివేలు తగ్గకుండా మద్దతు ధర కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. తెలంగాణ చేపడుతన్న సాగు నీటి ప్రాజెక్టులన్ని తమ ప్రభుత్వ హయాంలో రూపకల్పన చేసుకున్నవే అని గుర్తు చేశారు. గోదావరి బ్రిడ్జి, మోడికుంట ప్రాజెక్టు తమ హయాంలోనే జరిగాయని అన్నారు. తెలంగాణ రాప్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనని వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకునిరావాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి, షబ్బీర్ ఆలీ, దొంతి మాధవరెడ్డి, ఇనగాల వెంకట్రాంరెడ్డి, బలరాం నాయక్, సీతక్క, పొడం వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.