రాష్ట్రీయం

ప్రక్షాళనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: జూన్ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలులోకి తీసుకరానున్నట్టు సీఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రిజిస్ట్రేషన్ విధానంతోపాటు భూ లావాదేవీలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి ‘్ధరణి’ వెబ్‌సైట్‌నూ అప్పటి నుంచే అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. రిజిస్ట్రేషన్ల విధానంలో అవినీతి, జాప్యానికి ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా సంస్కరణలను తీసుకొస్తున్నట్టు వివరించారు. రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి ముందు ప్రయోగాత్మకంగా మొదటి విడతలో ఐదు మండలాల్లో, రెండో విడతలో 30 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి పరిశీలిస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చిన అనుభవాల ఆధారంగా భవిష్యత్‌లో ఎలాంటి పొరబాట్లకు ఆస్కారం లేకుండా తీర్చిదిద్దుతామన్నారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం, ధరణి వెబ్‌సైట్ నిర్వహణపై ప్రగతిభవన్‌లో బుధవారం రెవిన్యూ, ఐటీ అధికారులతో సీఎం చర్చించారు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం ప్రకారం భూములు విక్రయించేవారు, కొనుగోలు చేసే వారు ఒకసారి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తే సరిపోతుందని వివరించారు. తర్వాత పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ పత్రాలను సంబంధిత వ్యక్తులకు నేరుగా కొరియర్లో పంపించడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లేవారు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. స్లాట్ కేటాయించిన తేదీన విక్రయదారులు, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి తమ విక్రయ దస్తావేజులను, పాసు పుస్తకాలను సబ్ రిజిస్ట్రార్‌కు అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని విక్రయదారుని పాసు పుస్తకం నుంచి తొలగించి, కొనుగోలుదారుని పాసు పుస్తకంలో నమోదు చేస్తారన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయన రోజునే పాసు పుస్తకాలను తహసిల్దార్‌కు పంపిస్తే వివరాలను సరిచూసిన తర్వాత వాటిని ఐటీ అధికారికి పంపుతారన్నారు. ‘్ధరణి’ వెబ్‌సైట్‌లో వాటిని అప్‌లోడ్ చేసి తిరిగి సబ్ రిజిస్ట్రార్‌కు పంపిస్తే అక్కడి నుంచి కొరియర్‌లో సంబంధిత వ్యక్తులకు పంపించడం కొత్త విధానంలో జరిగే ప్రక్రియగా సీఎం వివరించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని, అలాగే అవినీతి, జాప్యానికి ఆస్కారం ఉండదన్నారు. జూన్‌నుంచి ప్రతీ మండలంలో రిజిస్ట్రేషన్లు జరగాలని, రాష్టవ్య్రాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు అవీలేని చోట 443 మండలాల్లో తహసిల్దార్లే రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వహిస్తారన్నారు. దీనిపై ఇప్పటికే తహిసిల్దార్లకు శిక్షణ ఇచ్చినట్టు సీఎం గుర్తు చేసారు. రాష్టవ్య్రాప్తంగా నిర్వహించిన భూప్రక్షాళన తర్వాత భూరికార్డుల వివరాలన్నీ ధరణి వెబ్‌సైట్‌లో నమోదవుతాయని, ఏ భూమికి యజమాని ఎవరనేది స్పష్టంగా తెలుసుకునే సదుపాయంతోపాటు ఇది పూర్తిగా పబ్లిక్ డాక్యుమెంట్‌గా ఉంటుందన్నారు. ధరణి వెబ్‌సైట్ వచ్చే నెల మే 7నుంచి మొదటి విడతలో ఐదు మండలాల్లో, మే 19 నుంచి రెండో విడతలో 30 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలులోకి వస్తుందన్నారు. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్టు అమలులోకి వచ్చే ఐదు మండలాల్లో మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్, రంగారెడ్డి జిల్లా కొత్తూరు, కామారెడ్డి జిల్లా సదాశివనగర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. రెండో విడతలో చేర్యాల, మానకొండూరు, మేడిపల్లి, నిర్మల్ రూరల్, బాల్కొండ, ఎల్లారెడ్డి, ఆసిఫాబాద్, నెనె్నల, అంతర్గాం, ఇల్లంతకుంట, రాయకల్, రామచంద్రాపురం, రామాయంపేట, మొగుళ్లపల్లి, కేసముద్రం, నర్సంపేట, హసన్‌పర్తి, రఘునాథపల్లి, ముదిగొండ, పాల్వంచ రూరల్, చివ్వెంల, కట్టంగూర్, తుర్కపల్లి, బిజినేపల్లి, పెబ్బేరు, ఐజ, దేవరకద్ర, శేరిలింగంపల్లి, నవాబ్‌పేట, గుడిహత్నూర్ మండలాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు.