రాష్ట్రీయం

అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ స్నాతకోత్సవం రేపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం ఈ నెల 20న నిర్వహిస్తున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే సీతారామారావు తెలిపారు. యూనివర్శిటీ ప్రాంగణంలోని ఓపెన్ ప్లాజాలో స్నాతకోత్సవం జరుగుతుందని, దీనికి ఛాన్సలర్ హోదాలో ఇఎస్‌ఎల్ నర్సింహన్ హాజరవుతారని ఆయన చెప్పారు. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు, బుక్ ప్రైజ్‌లు అందిస్తారని చెప్పారు. ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలను కూడా గవర్నర్ చేతులు మీదుగా అందిస్తామని ఆయన వెల్లడించారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య వెంకటయ్య, వివిధ విభాగాల డైరెక్టర్లతో కలిసి ఆయన బుధవారం నాడు పాత్రికేయులతో మాట్లాడారు. ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ వీసీ ఆచార్య ఎన్ వి వర్గీస్ స్నాతకోపన్యాసం చేస్తారని వీసీ తెలిపారు. సుమారు 34,387 మందికి డిగ్రీలు అందిస్తామని ఐదుగురికి ఎంఫిల్, పిహెచ్‌డి పట్టాలు ఇస్తామని అన్నారు. ఇందులో బీఏ 20,759 మంది, బీకాం 4307 మంది, బిఎస్సీ 4866 మంది, ఎంఎ ఎకనామిక్స్ 144 మంది, ఎంఎ హిస్టరీ 97 మంది, ఎంఎ పొలిటికల్ సైన్స్ 276 మంది, ఎంఎ సోషియాలజీ 427 మంది, ఎంఎ కమ్యూనికేషన్ 27 మంది ఉన్నారని మిగిలిన వారు పిజీ , ప్రొఫెషనల్ కోర్సులు చేశారని అన్నారు. 36 మంది విద్యార్థులు బంగారు పతకాలు పొందారని ఆయన చెప్పారు. అందులో 13 మంది డిగ్రీ పూర్తి చేసిన వారు కాగా మరో 23 మంది పీజీ చేసిన వారున్నారని అన్నారు. ప్రతిభ చూపిన మరో నలుగురు విద్యార్థులకు బుక్ ప్రైజ్ ఇస్తున్నామని వివరించారు. స్నాతకోత్సవం సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ఐదు కేంద్ర కారాగారాల్లో 106 మంది ఖైదీలు డిగ్రీ , పీజీలు సర్ట్ఫికేట్లు అందుకుంటారని అన్నారు. ఇందులో మహిళా ఖైదీలు ఉన్నారని చెప్పారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు అనంతసాగర్ భారతి విశే్వశ్వరరెడ్డి మెమోరియల్ బుక్ ప్రైజ్ సాధించారని చెప్పారు. త్వరలో డిగ్రీ స్థాయిలో విద్యార్థులకు కంప్యూటర్ అప్లికేషన్స్, స్టాటిస్టిక్స్, జియోగ్రఫీ సబ్జెక్టులను అందుబాటులోకి తెవాలని యోచిస్తున్నామని అన్నారు. మరో 10 ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో రీసెర్చి ప్రోగ్రాం నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు. నైపుణ్యాలను అభివృద్ధి చేసే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు.