రాష్ట్రీయం

ద.మ.రైల్వేకు మంచి గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: దక్షిణ మధ్య రైల్వే 2017-18లో ఉత్తమ పనితీరుకు జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక పండిత్ గోవింద్ బల్లబ్ పంత్ షీల్డులతో పాటు వివిధ విభాగాల్లో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను దేశంలోని 17 రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే జోన్ 17 షీల్డ్‌లను సొంతం చేసుకుంది. ఈ 17లో 6 సామర్ధ్య షీల్డులను సాధించి ఇతర జోన్‌లకు ఆదర్శంగా నిలిచింది. ఈ నెల 15 నుంచి 17 వరకు భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి ఎగ్జిబిషన్‌లో ‘ద.మ.రైల్వే-2022 వైపునకు పరివర్తన పథ యాత్ర’ అనే నినాదంతో దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలకు ప్రధమ బహుమతి వచ్చింది. అంతేకాకుండా రైల్వే మంత్రి పీయుష్ గోయల్ చేతుల మీదుగా ‘బెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఇనీషియేటివ్ అవార్డు’ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ స్వీకరించారు. అనేక శక్తివంతమైన నూతన ఆవిష్కరణలను అమలు, వ్యూహాత్మక పనితీరుకు ద.మ.రైల్వే అవార్డులు సొంతం చేసుకుందని రైల్వే అధికారులు తెలిపారు. కమ్మర్షియల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, పర్యావరణం-పరిశుభ్రత, స్టోర్స్, ఉత్తమ వర్క్‌షాప్ (రోలింగ్ స్టాక్, లాలాగూడ), ఉత్తమ రన్నింగ్ రూం వంటి విభాగాల్లో ఆరు సామర్ధ్య షీల్డులు లభించాయి.