రాష్ట్రీయం

అట్టహాసంగా సీపీఎం మహాసభలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 18: సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు బుధవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఐదు రోజులపాటు నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగే సభలకు 16 మంది పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోపాటు వివిధ వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బుధవారం ఉదయం 10గంటలకు పార్టీ సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం పార్టీ జెండా ఆవిష్కరించిన అనంతరం మహాసభలు ప్రారంభమయ్యాయ. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు స్వాగతోపన్యాసం చేయగా, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సంతాప తీర్మానాలను చదవి వినిపించారు. పార్టీకోసం చివరి నిమిషం వరకు పనిచేసిన మహ్మద్ అమీన్, కగేంన్‌దాస్, సుకుముల్ సేన్ పేర్లను పెట్టడం ఆనంద దాయకమని అన్నారు.
* సీనియర్ నేతలకు ఘన సన్మానం
మహాసభల సందర్భంగా పార్టీ ఆవిర్భావానికి కృషి చేయడంతోపాటు మొదటి జాతీయ కౌన్సిల్ సభులుగా పనిచేసిన కామ్రేడ్ శంకరయ్య (96), కామ్రేడ్ వీఎస్. అచ్చుతనందన్‌లను పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఘనంగా సన్మానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారి సేవలు చిరస్మరనీయమని కొనియాడారు.
* భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు
దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక న్యాయం, మతోన్మద బీజేపీని గద్దెదించడం వంటి అజెండాలతో నగరంలో జరుగుతున్న సీపీఎం పార్టీ 22వ అఖిల భారత మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పార్టీ బలంగా ఉన్న కేరళ, త్రిపుర రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, జమ్ముకాశ్మీర్ వంటి ప్రాంతాల నుంచి సైతం సభలకు ప్రతినిధులు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఐదు రోజులపాటు వారికి అచ్చమైన తెలంగాణ రుచులను వడ్డిస్తూ, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
* భారీ బందోబస్తు
సీపీఎం అఖిల భారత మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులతో పాటు మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరు కావడంతో ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కళ్యాణ మండపం చుట్టూ పోలీసులను మొహరించి గస్తీ నిర్వహిస్తున్నారు. కళ్యాణ మండపంలోనికి ప్రవేశించే ద్వారంలో మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీల అనంతరమే లోనికి అనుమిస్తున్నారు.