రాష్ట్రీయం

బీజేపీని దించడమే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో దేశాన్ని పాలిస్తున్న బీజేపీని గద్దె దించే అంశంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. జాతీయ మహాసభల్లో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ తీర్మానంపై చర్చ జరుగుతుందని, కాంగ్రెస్‌తో కలిసి నడవాలా లేదా అన్న అంశంపై మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. మూడు నెలల క్రితమే తీర్మానాన్ని రూపొందించామని, దీనిపై పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకొని సవరణలు చేసినట్టు చెప్పారు. శుక్రవారం సాయంత్రం వరకు చర్చలు కొనసాగే అవకాశం ఉందని, అనంతం ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు. మతోన్మాధంతో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీని గద్దె దించే అంశంలో అనుసరించాల్సిన విధానాలపై పొలిట్‌బ్యూరో సభ్యులు సమగ్రంగా చర్చిస్తున్నట్టు తెలిపారు. రాజకీయ తీర్మానాలను పొలిట్‌బ్యూరో సభ్యులు గతంలోను ప్రవేశపెట్టారని చెప్పారు. కారత్‌కు తనకు మనస్పార్థలంటూ వస్తున్న వార్తలు కేవలం ఉహాజనితమైనవేనని అన్నారు. దేశానికి నేతలు కాదు విధానాలే ముఖ్యమని, వామపక్ష, ప్రజాస్వామ్యశక్తులను బలపరిచేందుకు మొదట తాము బలాన్ని పుంజుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇతర పార్టీలతో తమ పార్టీ ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదని తెలిపారు. 1996, 2004లో యూపీఏకు బయటకు నుంచి మాత్రమే మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టుపెట్టకుండా రక్షించే బాధ్యతను సీపీఎం భుజాన వేసుకుందని, అందుకు కలిసి వచ్చే శక్తులను ఐక్యం చేస్తామని అన్నారు. కేసీఆర్ ఫ్రంట్‌ను మూసి ప్రవాహం లాంటిదని ఏచూరి అభివర్ణించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఫ్రంట్లు చాలా వస్తుంటాయని వాటి గురించి ప్రస్తావించే సమయం కాదని అన్నారు. దేశాన్ని రక్షించడమే సీపీఎం ఎజెండాగా ఉంటుందని అందు కోసమే తాము పనిచేస్తామని పేర్కొన్నారు.
లోయా మృతి కేసు పునఃసమీక్షించాలి...
సుప్రీం కోర్టు న్యాయమూర్తి లోయా మృతి కేసును పునఃసమీక్షించాలని ఏచూరి కోరారు. ఆయన మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో స్కాండలస్ అంటూ పేర్కొని బెంచ్ తిరస్కరించడాన్ని ఖండిస్తుందన్నారు. ఇది ముఖ్యమైన కేసు అయినందున దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని కోరారు.