రాష్ట్రీయం

వంచనపై ధర్మయుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: నవ్యాంధ్రప్రదేశ్ నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం నట్టేట ముంచింది. నాలుగేళ్ల నిరీక్షణ నిష్ఫలమయ్యేలా వ్యవహరించింది. ఐదుకోట్ల మంది ప్రజలను నిలువునా దగా చేసింది. చెంబెడు నీళ్లు, చారెడు మట్టి మొహాన కొట్టి దారుణంగా అవమానించింది. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది. ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంట్ సాక్షిగా మన వేదనను వెక్కిరించింది.. వంచించింది.. ప్రతి తెలుగువాడి గుండెను రగిలించింది. ఇలా అందరి ఆక్రోశం, ఆగ్రహం, ఆవేదన తనదిగా భావించి జనం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యమ శంఖం పూరించారు. శుక్రవారం తన పుట్టిన రోజు నాడు ‘్ధర్మ పోరాట దీక్ష’ పేరుతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిరశన దీక్ష చేయనున్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని కేంద్రానికి తెలిసొచ్చేలా చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు విషయంలో కేంద్ర వైఖరిని ఎండగట్టేందుకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల పాటు ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయనున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరపకుండా, అందరూ దీక్షల ద్వారా కేంద్రానికి మన ధర్మాగ్రహం తెలపాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం పుట్టినరోజు నాడు నిరశన దీక్ష చేయడం ఇదే ప్రథమం. 68 ఏళ్ల వయస్సులో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.ప్రత్యేక హోదా, లోటు భర్తీ, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అమరావతి నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజుపట్నం పోర్టు, శాసనసభ సీట్ల పెంపు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-విజయవాడల్లో మెట్రో రైలు, అమరావతికి రైలు-రహదారి అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సాయం, పొరుగు రాష్ట్రం నుంచి విద్యుత్
బకాయిల వసూళ్లు, షెడ్యూల్డ్ సంస్థల విభజన, గ్రేహౌండ్స్ సెంటర్ ఏర్పాటు ఇలా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో పేర్కొన్న 18 అంశాలపై నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి పోరాడుతూనే వచ్చారు. చివరికి రాష్ట్రం పట్ల కేంద్రం అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణితో విసిగిపోయిన ముఖ్యమంత్రి పోరుబాట పట్టారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్తున్నారు.
విగ్రహాల వరకే సమాఖ్య స్ఫూర్తి
నర్మదా నది మధ్యలో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.2,500 కోట్లు ఉదారంగా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఈ నాలుగేళ్లలో కేవలం రూ.2,500 కోట్లు మాత్రం ఇచ్చింది. ఇందులో విజయవాడ, గుంటూరు నగరాల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించడానికి కేటాయించిన రూ.వెయ్యి కోట్లను కూడా కలిపి చూపించింది. అమరావతిలో రాజభవన్, సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి భవనాలు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే ఐదేళ్లలోనే రూ.43వేల కోట్లు ఖర్చు చేయాల్సి వుంది. కానీ కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఈ అన్యాయాన్ని తన దీక్ష ద్వారా ముఖ్యమంత్రి ప్రశ్నించనున్నారు.
అమరావతిని పక్కనపెట్టి డొలేరా నిర్మాణం
షాంఘై కంటే ఆరు రెట్లు, ఢిల్లీ కంటే రెండు రెట్లు పెద్దగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు దగ్గర్లో డొలేరా నగరాన్ని 2.3 లక్షల ఎకరాల్లో నిర్మిస్తానని చెబుతున్న ప్రధానమంత్రికి, మనం 33వేల ఎకరాల్లో రాజధాని నిర్మించుకుందామంటే అపహాస్యంగా ఉంది. డొలేరాకు ఇప్పటికే రూ.4,100 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అమరావతిని చిన్నచూపు చూస్తోంది. ఈ వివక్షను దేశమంతటికీ అర్థమయ్యేలా చాటి చెప్పేందుకే ముఖ్యమంత్రి దీక్ష చేస్తున్నారు.
ముఖ్యమంత్రికి మద్దతుగా..
‘ధర్మ పోరాట దీక్ష’లో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. పెద్దఎత్తున రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు తరలివస్తారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వాణిజ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, బార్ అసోసియేషన్లు, వివిధ యూనియన్ల సభ్యులు దీక్షకు హాజరై తమ మద్దతు తెలుపుతారు.

చిత్రం..బాబు దీక్ష కోసం ముస్తాబవుతున్న విజయవాడలోని మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం