రాష్ట్రీయం

విభేదాలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: సీపీఎంలో ఎలాంటి విభేదాలు లేవని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ తీర్మానంపై చర్చ ముగిసిందని, పార్టీ ముఖ్య నేతల నుంచి వచ్చిన పలు సవరణలపై విస్తృతంగా చర్చ జరిపామన్నారు. ముఖ్యమైన సవరణలపై ఓటింగ్ నిర్వహించి అనంతరం రాజకీయ ముసాయిదాను వెల్లడిస్తామన్నారు. పార్టీలో మెజారిటీ, మైనారిటీ సమస్యే ఉత్పన్నం కాదని, మూడు నెలల క్రితం రూపొందించిన రాజకీయ తీర్మానంపై సభ్యులందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంతో సుదీర్ఘంగా చర్చజరుగుతుందన్నారు. ప్రతి ఒక్క సభ్యురు అభిప్రాయాన్ని వెల్లడించిన అనంతరం మెరుగైన విధానం తీసుకురావాలన్నదే తమ ధ్యేయమన్నారు. రహస్య ఓటింగ్ విధానం తమ పార్టీ రాజ్యాంగంలో లేదని, కేవలం కమిటీల ఎన్నిక సమయంలో, అత్యంత సంక్లిష్ట పరిస్థితిలోనే ఈ విధానాన్ని అమలు చేస్తారని తెలిపారు. రాజకీయ తీర్మానంపై జరుగుతున్న సాదారణమైనదని, ఆ విషయం గురించి ప్రత్యేకంగా రహస్య
ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉండదన్నారు. సభ్యులందరు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వివరించాలన్నదే ప్రాధాన ఉద్దేశమని అన్నారు. సీపీ ఎంలో సెంట్రల్ కమిటీ కంటే పార్టీ కాంగ్రెస్ ఉన్నతమైనదని, కీలక అంశాలపై ఇక్కడ స్పష్టమైన ముగింపు ఉంటుందన్నారు. 15వ ఆర్థిక సంఘం జనాబా ఆధారంగా నిధులు కేటాయించాలని నిర్ణయించడం ఇబ్బందికరమైన విషయమని అన్నారు. జనాబా నియంత్రించిన దక్షణాధి రాష్ట్రాలపై దీని ప్రాభావం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ప్రధాన అంశాల్లో ఈ విషయాన్ని చేర్చి విస్తృతంగా చర్చిస్తామని చెప్పారు. బీజేపీ పాలనను అంతమొదించడమే ప్రధాన అజెండాగా మహాసభల్లో నిర్ణయాలు తీసుకోనున్నట్టు వివరించారు.

చిత్రం..శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న ప్రకాష్ కారత్