రాష్ట్రీయం

కాస్టింగ్ కౌచ్‌లో రాజకీయ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: సినీ పరిశ్రమలో అవకాశాల పేరిట అమ్మాయిలను లోబరుచుకుంటు న్నారంటూ తలెత్తిన వివాదం చివరికి రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక వైపు బీజేపీపైనా, మరో వైపు తెదేపా, వైకాపాలపై తనదైన శైలిలో రాజకీయ ఆరోపణలతో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై తెలుగుదేశం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని లేపిన శ్రీరెడ్డి అనూహ్యంగా తనపైనా, తల్లిపైనా ఆరోపణలు చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న జనసేన నేత పవన్, ఆమె ఆరోపణల వెనుక రామ్‌గోపాల్ వర్మ, ఆయన బంధువైన శ్రీనిరాజు, తెదేపా ఎంపీ సుజనాచౌదరి, కొన్ని తెలుగు చానెళ్ల హస్తం ఉందం టూ ఆరోపణలు గుప్పించారు. అందుకు ఆధారాలు ఇవేనంటూ ట్వీట్లు చేయడంతో వివాదం పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. కాస్టింగ్ కౌచ్ వివాదం వెనుక అసలు రాజకీయం ఇదేనంటూ పవన్ బహిరంగంగా ఆరోపించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. పవన్ ట్వీట్లపై చంద్రబాబు కుమారుడు లోకేష్‌బాబు సైతం శుక్రవారం రాత్రి స్పందించారు. పార్టీ కార్యాలయంలోనూ, తన వ్యక్తిగత వ్యవహారాలు బయటకు లీక్ అవుతున్నాయనే ఆరోపణలతో గన్‌మెన్లను వెనుక్కు పంపించి 24 గంటలు గడవక ముందే, పవన్‌కళ్యాణ్, ఆయన తల్లిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలకు దిగడం సినీ పరిశ్రమను దిగ్భ్రమ పరిచింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్ అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. మరో పక్క ఆమెను వెంటాడి, వెంబడించి పరుగులు పెట్టించడంతో ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తన తప్పు తెలుసుకున్నానని క్షమాపణలు చెబుతున్నానని ట్వీట్ చేయడం ఒక పరిణామమైతే, ఈ వ్యవహారానికి దర్శకుడు తానేనని రామ్‌గోపాల్‌వర్మ ప్రకటిస్తూ క్షమాపణలు చెప్పడం మరో పరిణామం. ఇంకోపక్క పవన్ అభిమానులు ఇరు రాష్ట్రాల్లోనూ అనేక పోలీసు స్టేషన్లలో శ్రీరెడ్డిపైనా , రామ్‌గోపాల్ వర్మపైనా ఫిర్యాదు చేశారు. వ్యవహారం చేయి దాటకుండానే పవన్‌కళ్యాణ్ అభిమానులకు పిలుపునిస్తూ ఎలాంటి విధ్వంసాలకు పాల్పడవద్దని,
ఈ వ్యవహారంలో శ్రీనిరాజు తనపై ఫిర్యాదు చేస్తారని, ఆ ఫిర్యాదుకూ స్పందించవద్దని ముందస్తుగా పవన్‌కళ్యాణ్ ఒక ప్రకటన జారీ చేశారు. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు ఇటు టీవీ చానళ్లను, సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవడంతో క్షణక్షణం పరస్పర ఆరోపణలు రయ్యమంటున్నాయి. పవన్ తన అభిప్రాయాలను ప్రకటించిన కొద్ది సేపటికే రామ్‌గోపాల్‌వర్మ, మరోపక్క శ్రీరెడ్డిలు తీవ్రంగా స్పందించారు. తనను పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పిన పవన్‌కళ్యాణ్, తాను చేసిందేమిటో చెప్పాలని శ్రీరెడ్డి ప్రశ్నిస్తే, శ్రీనిరాజు ఫోటోను అప్‌డేట్ చేసి అభిమానులకు పిలుపునివ్వడంలో అంతరార్థం ఏమిటో చెప్పాలని రామ్ గోపాల్‌వర్మ ప్రశ్నించారు.
డిబేట్లపై మండిపాటు
దర్శకుడు గోపాల్‌వర్మ ప్రోత్సాహంతో సినీనటుడు పవన్‌కళ్యాణ్‌పై యువనటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ టీవీ చానళ్లు డిబేట్లు నిర్వహించడంపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై 24 గంటల్లో ఏం చర్యలు తీసుకుంటున్నారో తనకు సమాధానం చెప్పాలని పవన్ ‘మా’ ప్రతినిధులకు అల్టిమేటం ఇచ్చారు.

చిత్రం..పవన్ కల్యాణ్