రాష్ట్రీయం

నగరాలపై డ్రోన్ నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: అక్రమ నిర్మాణాలను గుర్తించేందుకు అత్యధునిక డ్రోన్ కెమెరాలను వినియోగించాలని పురపాలక శాఖ నిర్ణయించింది. అనధికార ఇసుక రీచులను డ్రోన్ల సాయంతో గుర్తించి గనులశాఖ సత్ఫలితాలు సాధించడంతో, వీటిని మున్సిపల్‌శాఖ కూడా వినియోగించాలని నిర్ణయించింది. డ్రోన్ కెమెరాలను వినియోగించడం ద్వారా ఒక్క అనధికార నిర్మాణాలనే కాదు, ఆస్తి పన్ను మదింపులో జరిగే మోసాలనూ గుర్తించవచ్చు. భవన యజమానులతో మున్సిపల్ సిబ్బంది కుమ్మక్కై భవనాల విస్తీర్ణాన్ని తగ్గించి తక్కువ ఆస్తి పన్ను మదింపుతో ఆదాయానికి గండికొడుతోన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను మందిపులో జరిగే మోసాలను అరికట్టడానికి ఇప్పటికే శాటిలైట్ ద్వారా చిత్రాలను తెప్పించుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే అనధికార ఇసుక రీచ్‌లను గుర్తించడంతోపాటు అనుమతి పొందిన దానికంటే ఎక్కువ ఇసుకను త్రవ్వడాన్ని డ్రోన్ కెమెరాలు పసిగట్టాయి. దీనివల్ల అక్రమార్కుల నుంచి భారీ జరిమానాలు, లీజుల రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం చిక్కింది. మున్సిపల్‌శాఖను నిర్వహిస్తున్న మంత్రి తారక రామారావుయే గనుల శాఖనూ నిర్వహిస్తుండటంతో అనధికార నిర్మాణాలకు కళ్లెం వేయడానికి డ్రోన్ కెమెరాలను వినియోగించుకోవాల్సిందిగా ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి
అరవింద్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ), డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డిటిసిపి), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అనధికార, అక్రమ నిర్మాణాలను గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిందిగా అరవింద్‌కుమార్ సూచించారు. గృహ నిర్మాణాల అనుమతి మంజూరులో జరుగుతున్న జాప్యం, అవినీతిని అరికట్టడానికి నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన కొత్త విధానాన్ని మున్సిపల్‌శాఖ తీసుకొచ్చింది. అయితే ఇప్పటికే ఈ విధానాన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రవేశపెట్టినప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి సామాజిక మాధ్యమాల ద్వారా పౌరులు కొందరు తీసుకువచ్చారు. అలాగే క్రెడాయి (రియల్ ఏస్టేట్ డవలపర్స్ అసొసియేషన్) ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమల స్థాపనకు అనుమతులను సులభతరం చేస్తూ టిఎస్-ఐపాస్ విధానాన్ని అమలు చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మూడు వారాల్లోనే అన్ని రకాల అనుమతులిచ్చే విధానాన్ని అమలు చేస్తోంది. ఈ శాఖనూ మంత్రి కేటిఆర్ నిర్వహిస్తుండటంతో అదే మాదిరి విధానాన్ని భవన నిర్మాణాల అనుమతులకు అమలు చేయాలని మంత్రి నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజులల్లోనే అనుమతి పత్రాన్ని జారీ చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతుల్లో జాప్యం, అవినీతిని అరికట్టడంతో పాటు ప్రభుత్వంలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం ఉండటానికి ఈ విధానం దోహదపడుతుంది. ఇకనుంచి 21 రోజులలో భవన నిర్మాణాలకు అనుమతి మంజూరును కచ్చితంగా అమలు చేయాలని శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదేశించారు. లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్‌ఆర్‌ఎస్) కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు అన్నింటినీ జిల్లాల వారీగా మదింపు చేసి తక్షణమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. భవన నిర్మాణాల అనుమతి, ఎల్‌ఆర్‌ఎస్ పత్రాల జారీపై ఇకనుంచి ప్రతీ వారం సమీక్షించాలని కూడా సంబంధిత అధికారులను అరవింద్‌కుమార్ ఆదేశించారు.