తెలంగాణ

ఒకరి బాటలో మరొకరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పలు అంశాల్లో పరస్పరం విమర్శించుకుంటున్నా కొన్ని అంశాల్లో మాత్రం ఒకరినొకరు అనుసరిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పంపకంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్.. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తరహానే అనుసరిస్తున్నారు. కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వంటి పథకాల్లో, అంగన్‌వాడి వర్కర్లకు జీతాల పెంపు, ఇంటింటి సర్వే వంటి అంశాల్లో కెసిఆర్‌ను చంద్రబాబు అనుసరిస్తున్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టగా, ఆంధ్రలోనూ అమ్మాయి వివాహానికి 50వేల రూపాయలు చెల్లించే పథకానికి శ్రీకారం చుడుతున్నారు. డబుల్ బెడ్‌రూమ్ పథకంపై సైతం ఆలోచన చేస్తున్నారు. కాగా పదవుల పంపకంలో మాత్రం కెసిఆర్ చంద్రబాబు మోడల్‌నే అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటివరకూ నామినేటెడ్ పదవుల పంపకం జరపలేదు. బాబు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పదవుల పంపకంపై నేడో రేపో పదవుల పంపకం అంటూ అనేకమార్లు వార్తలు లీక్ చేయించేవారు. అలా సంవత్సరాలు గడిచిపోయేవి. తెలంగాణ విషయానికొస్తే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు, ఆ తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఏప్రిల్ వరకు నామినేటెడ్ పదవుల పంపకానికి అవకాశం లేదు. గత సంవత్సరం ఏప్రిల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో పదవుల పంపకంపై చర్చ జరిపారు. ఆ తరువాత పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోనూ పదవుల పంపకం మాట వినిపించింది. దసరాకు పదవుల పంపకం అని పార్టీ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించారు. కానీ ఆచరణలో జరిగింది శూన్యమే. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు తొలిసారిగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో నియామకాలు జరుగుతాయనే అభిప్రాయం ఏర్పడింది. ఏడాది గడిచినా ఎలాంటి నిర్ణయం జరగలేదు.
ఇప్పటివరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవిని నియమించడం మినహా నామినేటెడ్ పదవులు ఏవీ భర్తీ కాలేదు. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలను క్యాబినెట్ ర్యాంకుతో పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించినా హైకోర్టు ఈ నియామకాలను కొట్టివేసింది. అధికార భాషా సంఘంతోపాటు సాహిత్యం, నాటక రంగాలకు అకాడమీలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొన్ని కార్పొరేషన్‌లను విలీనం చేయడం, కొన్నింటిని రద్దు చేయడం జరిగే అవకాశం లేకపోలేదు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అనేకమంది నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పదవుల పంపకంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోందని మంత్రులు తెలిపారు.
ఇక ఆంధ్రలో సైతం చంద్రబాబు నామినేటెడ్ పదవుల పంపకం పూర్తి చేయలేదు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు, గిడ్డంగుల సంస్థ చైర్మన్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వంటి కొన్ని నామినేటెడ్ పదవులను మాత్రం భర్తీ చేశారు.