రాష్ట్రీయం

మనమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎంపికలో టీడీపీ నిర్ణయమే కీలకంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. బీజేపీకి రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని ఆయన జోస్యం చెప్పారు. నాలుగు సీట్లు తక్కువ వచ్చి ఉంటే ప్రధాని మోదీ మన మాట వినేవారని వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో సాధికార మిత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రతికూల వైఖరి వల్లే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పతనం అవుతుందన్నారు. కతువా అత్యాచారం లాంటి ఘటనలను నివారించడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న తీరు వల్ల దళితుల్లో ఆందోళన నెలకొందని, దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీపై పడుతుందన్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం ముఖ్యమంత్రిగా ప్రధానితో పోరాడుతున్నామని తెలిపారు. అందరూ సహకరించి ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. కేంద్రం దిగివచ్చేలా చేసి లక్ష్యాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ ఆడుతున్న దొంగాటకు కళ్లెం వేయాలని పిలుపునిచ్చారు.ప్రజలను చైతన్యపరచేందుకు, పోరాటానికి సిద్ధం చేసేందుకు దీక్ష చేశానని తెలిపారు. లాలూచీ రాజకీయాల వలన రాష్ట్రం నష్టపోతుందని, ఐక్యంగా ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. కేంద్రం చాలా అహంభావంతో ఉందని, తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా చూశానని తెలిపారు. నాలుగేళ్లు కష్టపడ్డామని మరో పదేళ్లు కష్టపడితే దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదుగుతామని తెలిపారు. పటేల్ విగ్రహానికి 2,500 కోట్ల రూపాయలు కేటాయించారని, రాజధాని నిర్మాణానికి మాత్రం 1500 కోట్లే ఇచ్చారంటూ ఆరోపించారు. రాష్ట్భ్రావృద్ధి అంటే బాధ్యత లేదు కాబట్టి అఖిలపక్ష సమావేశానికి వివిధ సంఘాలు హాజరైనా రాజకీయ పార్టీలు రాలేదన్నారు. ప్రధాని ఎవరో తేల్చే శక్తి మనకొచ్చే
సమయం ఎంతో దూరం లేదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాధికార మిత్రలకు రాష్ట్రంలో వినూత్న అవకాశం కల్పించామని సీఎం తెలిపారు. తాను నమ్మేది అక్కలు, చెల్లెళ్లు అయిన డ్వాక్రా, మెప్మా సంఘాల సభ్యులనేనని, అందుకే రాష్ట్రంలో ఏ పని వచ్చినా వారికే అప్పచెబుతున్నామన్నారు. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుపై గ్రామాల్లో వార్డు స్థాయిలో సాధికార మిత్రలు దృష్టి సారించాలన్నారు. రాష్ట్రాన్ని అసంబద్ధంగా విభజించారని రాష్ట్ర అభివృద్ధి కోసం 12 గంటలు ధర్మపోరాట దీక్ష చేశానని, ఇందులో
తనకెటువంటి స్వార్థం లేదని స్పష్టం చేశారు. కేంద్రం సహకరించకపోయినా అక్కచెల్లెళ్ల కోసం పసుపు, కుంకుమ స్ర్తి నిధి కింద నిధులు మంజూరు చేశానని గుర్తుచేశారు. రాష్ట్భ్రావృద్ధి కోసం మరిన్ని గంటలు పనిచేయడానికి సిద్ధమేనన్నారు. ఎన్ని త్యాగాలు చేయటానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. సామ, దాన, భేద దండోపాయాలను సమయానుకూలంగా ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. పోరాడైనా సరే తెలుగు ప్రజలకు మేలు చేసే చర్యలు తీసుకోవాలని ముందడుగు వేశానన్నారు. ప్రజల్లో జీరో అసంతృప్తి వ్యక్తం చేసేలా మరింతగా పనిచేయాలన్నారు. ఆడపిల్లలు సమాజంలో తగ్గిపోవడానికి కారణం ప్రజల ఆలోచన విధానం వల్లేనన్నారు. ఆ ఆలోచనా ధోరణి మారాలని మగపిల్లలు, ఆడపిల్లలు, మొగపిల్లలు సమానమనే భావన వ్యవస్థలోకి తీసుకువెళ్లాలని, ఇందుకు ఏపీ మోడల్‌గా నిలువాలన్నారు. సాధికార మిత్రలు సమన్వయ కమిటీగా ఏర్పడి అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కోసం సమష్టి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ పరిధిలో డోర్ డు డోర్ చెత్త సేకరణ, ఎల్‌ఈడీ బల్బులు వంటి తొమ్మిది కార్యక్రమాలను డ్వాక్రా సంఘాలకు అప్పగించే రూపకల్పన చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని నూరు శాతం ఓడీఎఫ్ రాష్ట్రంగా ఏప్రిల్ చివరి నాటికి తీర్చిదిద్దాల్సిన బాధ్యత సాధికార మిత్రలదేనన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమశాఖకు చెందిన పోషకాహార పట్టిక ఆవిష్కరించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.