రాష్ట్రీయం

ఏం సాధించారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేసిన దీక్ష గాడ్సే దీక్షను మరిపించేదిలా ఉందని, కొంగజపం...దొంగ దీక్షలా చంద్రబాబు చేసిన దీక్షకు రూ.30కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారని కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ప్రజా సంకల్పయాత్ర సభలో ప్రతిపక్షనేత వైకాపా నేత వైఎస్ జగన్మోహనరెడ్డి మండిపడ్డారు. జగన్ యాత్ర శనివారం నూజివీడు మండలం యనమదల, సుంకొల్లు ట్రిపుల్‌ఐటీ మీదుగా శ్రీనివాస్ సెంటరు నుండి చిన్నగాంధీబొమ్మ సెంటరుకు చేరుకుంది. చిన్నగాంధీబొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్ మాట్లాడుతూ నాలుగేళ్ళ బాబు పాలన మోసాలు, అబద్ధాలు,
అవినీతి, అన్యాయాలనే నాలుగు స్తంభాలపైనే కొనసాగిందన్నారు. ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని వాగ్దానం చేసి, గెలిచిన తరువాత విస్మరించారన్నారు. రైతులను అడ్డగోలుగా మోసం చేసిన చంద్రబాబు రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళను కూడా కంటతడి పెట్టించారని అన్నారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంక్‌ల నుండి నోటీసులు రావడంతో కుటుంబాలు, కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోతున్న విషయం నిజం కాదా అని సభా ముఖంగా ప్రశ్నించారు. రోజుకో మాట చెబుతూ, రోజుకో వేషం వేస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, ఆయన నటనకు పద్మభూషణ్ ఇవ్వొచ్చన్నారు. శుక్రవారం విజయవాడలో చేసిన దీక్షలో చంద్రబాబునాయుడు 420 వేషం వేశారని, నాల్గవనెల 20వ తేదీన పుట్టిన చంద్రబాబునాయుడు 420గా కొత్త వేషం వేశారని అన్నారు. 12 గంటల పాటు దీక్ష చేసిన 420 చంద్రబాబునాయుడు 30కోట్లు ఖర్చు చేసినట్లు చూపారని అదంతా ప్రజలపైనే వేస్తారని అన్నారు. పెద్దబాబైన చంద్రబాబు మట్టి మాఫియా నుండి.. మద్యం, కరెంటు కొనుగోలు, రాజధాని భూముల విషయంలో కోట్లు దండుకుంటుంటే, గ్రామస్థాయిలో చినబాబులైన జన్మభూమి కమిటీ సభ్యులు పెన్షన్లు, రేషన్ బియ్యం, మరుగుదొడ్లు మంజూరులో అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ప్లాన్‌లు వేస్తారని, మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. ప్రజలను ఇంత మోసం చేస్తున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికల్లోతగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తానని, ఒక బెంజికారు ఇస్తానని, ప్రతి ఒక్కరికి 3వేల నుండి 5వేల రూపాయలు ఇస్తానని చెబుతారన్నారు. ఇచ్చిన వాటిని తీసుకుని మన పార్టీకే ఓటు వేసి గెలిపించాలని, అదంతా మన డబ్బేనని జగన్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము ప్రకటించిన నవరత్నాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రత్యేక ప్యాకేజి అంటూ కూర్చున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ప్రజలు హోదా కోసం పోరాటాలు చేస్తుంటే వారితో జతకట్టి కేంద్రంపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి చెందిన ఎంపీలతో రాజీనామా చేయించలేని చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాలు గెలుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఢీల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే టీడీపీ ఎంపీలు దానిని రాజకీయం చేయాలని చూశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు, వైకాపా జిల్లా కన్వీనర్ కొలుసు పార్థసారథి, వంగవీటి రాధా, తదితర నాయకులు జగన్ వెంట ఉన్నారు.
చిత్రం..శనివారం నూజివీడు సభలో మాట్లాడుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి