రాష్ట్రీయం

కాస్టింగ్ కౌచ్‌పై కదిలిన టీ. సర్కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతోన్న కాస్టింగ్ కౌచ్ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి సర్కారు రంగంలోకి దిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సినీ రంగం వేడెక్కిపోవడం, సమస్య తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తడంతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన అన్ని వర్గాలతో శనివారం కీలక భేటీ జరిగింది. కాస్టింగ్ కౌచ్ తరహా వివాదాలు పునరావృతం కాకుండా, నటీనటుల హక్కులకు భంగం కలగని రీతిలో తగిన చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోం, కార్మిక శాఖలు, షీ టీమ్స్‌తో పాటు ‘మా’
అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎఫ్‌డిసి చైర్మన్ రాంమోహన్ రావు అధ్యక్షతన ఏర్పడే కమిటీలో ఎఫ్‌డిసి, మా అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ నుంచి ఎంపిక చేసిన వారు సభ్యులుగా ఉంటారు. మంత్రి తలసాని మాట్లాడుతూ కమిటీ వారం పది రోజుల్లో సమావేశమై కార్యాచరణను సిద్ధంచేసి ప్రభుత్వానికి అందిస్తే దానిపై మరోసారి అన్ని వర్గాలతో చర్చిస్తామని వెల్లడించారు. మహిళా ఆర్టిస్టులకు తగు రక్షణ కల్పించేందుకు అవసరమయ్యే చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, కార్మిక శాఖ కమిషనర్ మహ్మద్ నదీమ్, ఎఫ్‌డీసీ ఇడి కిషోర్‌బాబు, సిఐడి ఎస్‌పి అపూర్వారావు, మా అధ్యక్షుడు శివాజీరాజా, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్ శంకర్, చలన చిత్ర ప్రముఖులు జీవిత రాజశేఖర్, తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, జెమిని కిరణ్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం హోం, కార్మిక శాఖలు, షీ-టీమ్స్‌తో పాటు ‘మా’ అసోసియేషన్, నిర్మాతల అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్