రాష్ట్రీయం

ఏపీ సీఎం లక్ష్యంగా పవన్ ట్వీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్వీట్ల పర్వాన్ని శనివా రం నాడూ కొనసాగించారు. ‘నిజవైన అజ్ఞాతవాసి ఎవరో మీకు తెలుసా’ అంటూ ట్వీట్ చేశారు. కాస్సేపు అయ్యాక నాకు ఇష్టమైన స్లోగన్ ‘ప్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలి అనే నినాదం.. అసలు ఈ నినాదం వెనక ఉన్న కథకు, ఈ స్లోగన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? స్టే ట్యూన్‌డ్ హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం, నిజాలను నిగ్గు తేలుద్దాం... ప్రొగ్రాం నుంచి మీ పవన్ కళ్యాణ్’ అంటూ ట్వీట్ చేశా రు. స్టే ట్యూన్‌డ్ పవన్ కళ్యాణ్ విత్ కెమరామన్ ట్విట్టర్ అంటూ పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. దీంతో పాటు పవన్ చేసిన పలు ట్వీట్లు కలకలం రేపుతున్నా యి. పవన్ ఏం చెబుతారో అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక రాష్ట్ర క్యాబినెట్ ర్యాంకు మంత్రి స్వయాన ఈ అజ్ఞాతవాసిని వాడో బ్లాక్ మెయిలర్ అని స్వయాన సీఎం ఇంకొకరితో అన్నారని పేర్కొన్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవ రు? ఆ సీఎం ఎవరు? తెలుసుకువాలని ఉందా అని అడిగారు. కాగా పవన్ పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. శుక్రవారం నాడు మా కార్యాలయానికి వెళ్లి అల్టిమేటం ఇచ్చిన పవన్ అన్నపూర్ణ స్టూడియోకు వస్తున్నట్టు తెలియగానే అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దాంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. పవన్‌తో భేటీ సమావేశాన్ని అన్నపూర్ణ స్టుడియోస్‌లో నిర్వహించలేమని స్టుడియో ప్రతినిధులు పేర్కొన్నట్టు సమాచారం. దాంతో పవన్ అక్కడికి వెళ్లకుండా తన ప్రణాళిక మార్చుకున్నట్టు తెలిసింది. అంతకు ముందే మా ప్రతినిధులు సమావేశమై క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. మరో పక్క సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రికి వివరించనున్నట్టు తెలిసింది.