రాష్ట్రీయం

భారీ ఏర్పాట్లు.. హాజరు కానున్న హేమాహేమీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: సీపీఎం పార్టీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ఆదివారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈనెల 18న పా ర్టీ సీనియర్ నాయకులు మల్లు స్వరాజ్యం జెండా ఆవిష్కరణతో ప్రారంభమైన మహాసభలు ఆదివారం జరిగే బహిరంగ సభతో ముగియనున్నాయి. జాతీయ మహాసభల సందర్భంగా సరూర్‌నగర్ స్టేడియంలో అట్టహాసం గా నిర్వహించనున్న సభ ఏర్పాట్లను శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డిజి నర్సింహారావులు పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా పార్టీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10వేల మంది కూర్చునేందుకు సీట్ల ఏర్పాటుతో పాటు ప్రత్యేకంగా కార్పెట్లను సిద్ధం చేశారు. బహిరంగ సభను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో ఆరు ఎల్‌ఇడీ స్క్రీన్లు, ఎల్బీనగర్ చౌరస్తా వరకు మరో ఆరు ఎల్‌ఇడీ స్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు.
అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు...
సీపీఎం పార్టీ బహిరంగ సభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆలరించనున్నాయి. సుమారు 700 మంది కళాకారులు సభ విజయవంతానికి గ్రామ గ్రామాన ఇప్పటికే కార్యక్రమాలను నిర్వహించారు. బహిరంగ సభ సందర్భంగా ఉద్యమ గీతాలతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లేలా ప్రత్యేక గీతాలను రూపొందించారు పార్టీ కాళాకారుల విభాగం.
రెడ్‌షర్ట్స్ కవాతు..

బహిరంగ సభకు ముందు సుమారు ఐదు వందల మంది వరకు రెడ్‌షర్ట్స్‌తో కవాతు నిర్వహించనున్నారు. మధ్యాహ్నాం 3 గంటలకు మలక్‌పేట నుంచి రెడ్‌షర్ట్స్ వాలంటీర్లు రోడ్డుపై కవాతు చేస్తూ సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అనంతరం ఐదు గంటలకు మహాసభను ప్రారంభించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, బృందా కారత్, కేరళ ముఖ్యమంత్రి విజయన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, బీవీ.రాఘవులు, తమ్మినేని తదితర పార్టీ ముఖ్యనేతలు పాల్గొని ప్రసంగించనున్నారు.
భద్రత కట్టుదిట్టం..

సరూర్‌నగర్ స్టేడియంలో సీపీఎం భారీ బహిరంగ సభను పురస్కరించుకొని పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సభకు జాతీయ స్థాయిలో ముఖ్య నేతలతో పాటు భారీగా ప్రతినిధులు, కార్యకర్తలు తరలివస్తున్న నేపథ్యంలో వందలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. పోలీసులతో పాటు పార్టీ శిక్షణ ఇచ్చిన సుమారు 1000 మంది వాలెంటీర్లు భద్రత విధులను నిర్వహించనున్నారు.

చిత్రం..శనివారం జరిగిన సిపీఎం జాతీయ మహాసభల్లో ప్రదర్శన ఇస్తున్న కళాకారులు