ఆంధ్రప్రదేశ్‌

‘కనకమేడల’ను సత్కరించిన ఏపీ బార్ కౌన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ను శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఏపీ బార్ కౌన్సిల్ సత్కరించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ రవీంద్రకుమార్ న్యాయ వాది వృత్తిలో రాణించి అందరి మన్ననలను పొందారని శ్లాఘించారు. ప్రజలకు సేవ చేసే అపురూపమైన అవకాశం కనకమేడల రవీంద్రకుమార్‌కు లభించిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కనకమేడల మాట్లాడుతూ తాను న్యాయవాదులు, ప్రజలకు అందుమాటులో ఉంటానని, అందరికీ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన పదవితో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి ప్రతాప్ రెడ్డి, ఆంధ్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి వెంకటేశ్వర్లు, తెలంగాణ అడ్వకేట్ల సంఘం అధ్యక్షుడు సి దామోదర్ రెడ్డి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు న్యాయవాదులు, న్యాయ కోవిదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీమతి ఎన్ రేణుక వందన సమర్పణ చేశారు.