రాష్ట్రీయం

అన్ని పార్టీల్లోనూ మీరే చేర్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ), ఏప్రిల్ 21: నేను రాజకీయాల్లోకి రాకుండానే అన్ని పార్టీల్లోకి మీరే (మీ- మీడియా) చేర్చేశారంటూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఛలోక్తి విసిరారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన శనివారం సంపత్ వినాయగర్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చే ముందు మీడియాకు తప్పకుండా వెల్లడిస్తానన్నారు. రాష్ట్ర విభజన చ ట్టంలోని హామీలపై ప్రభుత్వం వివిధ మాధ్యమాల ద్వారా తన డి మాండ్‌ను వినిపిస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని, హోదాతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. తన రాజీనా మా ప్రక్రియ జరుగుతోందని, మనస్సులో భావనలు, రాష్ట్రంలో సమస్యలపై అధ్యయనం చేసిన తరువాత భావ ప్రణాళికను ప్రకటిస్తానున్నారు. సుస్థిర ప్రభుత్వం, మంచి పరిపాలన చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా చేరాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గురుదేవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీలో పాల్గొన్న ఆయన, దివ్యాంగులకు సేవ చేయడం ద్వారా సంపూర్ణ మానవ సేవ చేసినట్లేనన్నారు.