రాష్ట్రీయం

ఎంసెట్ తొలిరోజు 94.98% హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 22: ఏపీ ఎంసెట్-2018 ఆదివారం తొలిరోజు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరిగినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు తెలిపారు. ఈ పరీక్షకు 94.98 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఉదయం 32,772 మంది హాజరుకావల్సి ఉండగా 31,157 మంది హాజరయ్యారని, 1615మంది గైర్హాజరయ్యారని ఆయన చెప్పారు. మొత్తం 95.07 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. మధ్యాహ్నం పరీక్షలకు 32,762 మంది హాజరుకావల్సి ఉండగా 31,117 మంది పరీక్ష రాశారని, 1645మంది గైర్హాజరయ్యారన్నారు. మొత్తం 94.98 శాతం హాజరు నమోదైనట్టు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్
పరీక్షలకు మొత్తం 2,75,995 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఈనెల 24వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు, 25వ తేదీన అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహిస్తారు. కాగా ఎంసెట్ దరఖాస్తుపై గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలన్న నిబంధన విధించడంతో అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. ఎంసెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అనంతరం దరఖాస్తుపై సంబంధిత ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లేక గెజిటెడ్ అధికారిచే అటెస్టేషన్ చేయించాలని నిబంధన విధించారు. ఈ నిబంధన వారికి తీవ్ర అసౌకర్యంగా మారింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిచూసుకుని పంపిస్తుండగా ఇక ఇటువంటి నిబంధనలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.