రాష్ట్రీయం

ప్రతి ఇంటికీ నల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత మంచి నీరు ఇవ్వలేకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగబోమని చెప్పిన మాటకు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలిపారు. మిషన్ భగీరథ పనులపై ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యుస్ ఇఎన్‌సి సురేందర్ రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్, సిఈలు, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయ్యిందన్నారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు నాలుగైదు నెలలకు ముందే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికీ మంచి నీటి సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్న జిల్లాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథలో ప్రధానమైన పనులు పూర్తయ్యాయని, ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైపులైన్లు, పంపు సెట్లతో కూడిన మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, గ్రామాల్లో అంతర్గత పనులు పురోగతిలో ఉన్నాయని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనిలో 75 శాతం పూర్తయ్యిందన్నారు. ఇప్పటికే చాలా గ్రామాలకు నీరు అందుతున్నదని, కొన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా కూడా నీరందిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే నెల చివరి నాటికి ప్రతి గ్రామానికి నీరు అందాలన్నారు. బల్క్ సప్లయి చేసే సందర్భంలో తలెత్తే సమస్యలను జూన్ 10 నాటికి పరిష్కరించాలని, గ్రామాల్లో అంతర్గత పనులను కూడా సమాంతరంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
దసరా నాటికి అంతర్గత పనులు పూర్తి చేయాలన్న గడువు విధించుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, గ్రామాల్లో వేయడానికి కావాల్సిన పైపు లైన్లు, నల్లా పైపులు, నల్లాలు, ఇతర పరికరాలను ముందే సేకరించి పెట్టుకోవాలని ఆయన తెలిపారు. దసరా నాటికి పనులు పూర్తి చేసి ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకోవాలని, డిసెంబర్‌లోగా వందకు వంద శాతం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తయి గ్రామాల్లోని అన్ని ఇళ్ళకు స్వచ్చమైన మంచి నీరు అందించాలని ఆదేశించారు. దీని ద్వారా వచ్చే ఎన్నికలలోగా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా స్వచ్చమైన మంచి నీరు అందించకపోతే ఓట్లు అడగేది లేదని తీసుకున్న సవాల్‌ను విజయవంతంగా అమలు చేసిన వాళ్లమవుతామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఫ్లోరైడ్, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.