రాష్ట్రీయం

విజయం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 23 : రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం అన్ని విధాలా ప్రయత్నంచేశానని, సామ, దాన, భేద ఉపాయాలను వినియోగించినా ఫలితం లేకపోయిందని, అందువల్లే ఇక దండోపాయమే శరణ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ధర్మం, న్యాయం మనవైపే ఉన్నాయని, అందువల్ల విజయం మనదే అవుతుందన్నారు. భారతంలో అయిదు ఊర్లు ఇమ్మని పాండవులు అడిగితే దాన్ని కాదన్న కౌరవులు కురుక్షేత్రంలో జరిగిన ధర్మపోరాటంలో చిత్తుగా ఓడిపోయారని, ఇప్పుడు తాను కూడా అదే తరహాలో ధర్మపోరాటానికి శంఖారావం చేశానన్నారు. ఇక వదిలేది లేదని, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక విపక్షాలు విషం కక్కుతున్నాయని, ఈ అవాంతరాలను అధిగమించి, రాష్ట్రానికి ప్రయోజనాలను సాధించి తీరాలన్నదే తన లక్ష్యమన్నారు. మూడవ సోమవారం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. డయాఫ్రమ్‌వాల్, స్పిల్ ఛానల్, ఇతర పనులను పరిశీలించిన అనంతరం విద్యారంగం, రైతుల్లోని ప్రముఖులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, వెంకన్న సాక్షిగా అప్పట్లో మోదీ హామీయిచ్చారని, మాట నిలబెట్టుకోకుంటే ఆ దేవుడికే సమాధానం
చెప్పుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్న పనులకు కూడా అడ్డంకులు సృష్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ వాటిని దీటుగా ఎదుర్కొని రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. పోలవరం విషయంలో అపోహలు, అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నాలుచేశారని, దానికోసం కోర్టులకు, ట్రిబ్యునళ్లకు కూడా వెళ్లారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న పనులు ప్రత్యక్షంగా చూసిన మీరంతా ఒక్కొక్కరూ వందమందికి, వెయ్యిమందికి చెప్పాల్సిన అవసరంవుందన్నారు. తన కష్టానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అయిదుకోట్ల మంది ప్రజానీకానికి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.5357 కోట్లు ఇచ్చిందని, ఇంకా రూ.2900 కోట్లు రావాల్సివుందన్నారు. ప్రస్తుతం డీపీఆర్-1 కింద నిధులు విడుదలవుతున్నాయని, త్వరలోనే డీపీఆర్-2 కూడా ఆమోదం పొందితే దాని ప్రకారం నిధులు విడుదల చేయాల్సివుంటుందన్నారు. నిధుల రాకలో కొంత జాప్యం ఉన్నప్పటికీ రాష్ట్ర నిధులతోనే ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళుతున్నామని, దీనిపై వడ్డ్భీరం కూడా పడుతోందన్నారు. డీపీఆర్-2 ఆమోదం పొందేలోగా మరో పది వేల కోట్ల రూపాయలను అందుబాటులోకి తీసుకువస్తే ప్రాజెక్టు పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయన్నారు. డీపీఆర్-2 ప్రకారం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిమిత్తం రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. రాష్ట్రానికి సరైన న్యాయం జరగాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను తాను 57 సార్లు వర్చువల్ ఇన్‌స్పెక్షన్ ద్వారా పరిశీలించానని, అలాగే స్వయంగా దాదాపు 24సార్లు వచ్చానని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా ముందుకు సాగుతున్నాయని, ఇప్పటి వరకు దాదాపు 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ మేనెలలో పనులను మరింత వేగవంతం చేస్తామని చెప్పారు. జూన్ నాటికి గోదావరి వరదలు ప్రారంభమయ్యే అవకాశమున్నందున ఆ లోగా డయాఫ్రమ్‌వాల్, స్పిల్‌వే పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. 2019నాటికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణపనులన్నింటిని పూర్తి చేసి రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు అందిస్తామన్నారు. మొత్తంమీద ఈ డిసెంబర్ నాటికి ప్రాజెక్టుకు సంబంధించి మట్టి పనులన్నింటిని పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించామని, మే నెలాఖరునాటికి వాటిని పూర్తి చేస్తామన్నారు. అలాగే జెట్ గ్రౌటింగ్ పనులను మేనెలాఖరునాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
ఒకప్పుడు ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం కోసం కాటన్ దొర ముందుకు వెళ్లారని, అప్పట్లో ఆయనను కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, అయినప్పటికీ బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తిచేసి లక్షల రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపారని చెప్పారు. అందువల్లే ఇప్పటికీ తల్లిదండ్రులతో సమానంగా కాటన్ దొరకు పిండం పెడుతుంటారని, మేలు చేసిన వారి విషయంలో తెలుగుజాతి కృతజ్ఞతాభావం ఆ స్థాయిలో ఉంటుందన్నారు. ఈ సందర్బంగా పలు అంశాలను ఆయన ప్రస్తావిస్తూ శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా, శారద, నర్మద వంటి మరికొన్ని చిన్న నదులను కూడా అనుసంధానం చేసి ఎక్కడ వర్షం పడినా ఆ నీరు నదుల్లో పారేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో పంట కుంటలు ఏర్పాటుచేసి మూడు నెలలపాటు నీరు భద్రంగా వుండేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ఎకరాల్లో పంటకుంటల ప్రయోగాన్ని చేస్తున్నామని, భవిష్యత్తులో రెండు కోట్ల ఎకరాలకు నీటిని సమృద్ధిగా అందించి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్న ఘనత కూడా తమ ప్రభుత్వానికే దక్కుతుందని, గత ఏడాది 145 టీఎంసీల నీటిని రాయలసీమకు మళ్లించామన్నారు. ప్రధానంగా ఉద్యానవన పంటలను ప్రోత్సహించి హార్టికల్చర్ హబ్‌గా రాయలసీమను తీర్చిదిద్దుతామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పులివెందులకు నీటిని అందించి, ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కెఎస్ జవహర్, ఎంపీ మాగంటి బాబు, తోట సీతారామలక్ష్మి, మాగంటి మురళీమోహన్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మొరాయించిన స్విచ్
స్పిల్‌ఛానల్ కాంక్రీట్ పనులను ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రిమోట్ ద్వారా పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అయితే రిమోట్, మరోవైపు స్విచ్ కూడా వెంటనే ఆన్ కాకపోవటంతో ఆయన వెనుదిరిగారు. అయితే డయాఫ్రం వాల్ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న సమయంలో మరోసారి స్పిల్‌ఛానల్ వద్దకు చేరుకుని స్విచ్ ఆన్‌చేసి పనులను ప్రారంభించారు.
చిత్రం..పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో గోదావరి నీటిని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు