రాష్ట్రీయం

అడవిలో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 23: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న వరుస సంఘటనలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరాటంలో స్థానిక గిరిజనులు నలిగిపోతున్నారు. ప్రధానంగా భద్రాచలం డివిజన్‌కు చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ఉండటం, ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండటం, మావోయిస్టులు ఈ ప్రాంతానే్న కేంద్రంగా చేసుకొని తమ కార్యకలాపాలు సాగిస్తుండటంతో ఈ ప్రాంతంలో పట్టు సాధించేందుకు అదనపు బలగాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆదివారం మహరాష్టల్రోని గడ్చిరౌలి ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 16మంది మావోయిస్టులు మృతి చెందగా, సోమవారం చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మరణించారు. కొన్నిరోజుల క్రితం భద్రాచలం డివిజన్‌లోని చర్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13మంది మావోయిస్టులు మరణిస్తే, ఆ తరువాతి సంఘటనల్లో ముగ్గురు జవాన్లూ మరణించారు. మావోయిస్టులు ఇటీవల బంద్‌కు పిలుపునిస్తే పూర్తిస్థాయిలో బంద్ జరగటం విశేషం. ఇదే క్రమంలో మావోయిస్టుల నియమకాలు కూడా చేపడుతున్నారని ప్రచారం జరుగుతుండగా దాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రత్యేక వ్యూహన్ని రచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులు మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. కొంత కాలం క్రితం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సమావేశమైన పోలీస్ అధికారులు ప్రత్యేక వ్యూహరచనతో మావోయిస్టులపై ఎదురు దాడికి దిగారు. మరో సమావేశాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్నట్లు తెలిసింది.