రాష్ట్రీయం

పంట నష్టం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇటీవల అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బిజెపి నాయకులు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను కోరారు. సోమవారం బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఆ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, ఇతర నాయకులు ప్రకాశ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సాంబమూర్తి, సుధాకర్ శర్మ తదితరులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో, వడగండ్లతో పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదని వారు చెప్పారు. కాబట్టి పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా వారు గవర్నర్‌ను కోరారు.

చిత్రం..గవర్నర్ నరసింహన్‌ను కలిసిన బీజేపీ నేతలు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, రామచంద్రరావు, బద్దం బాల్‌రెడ్డి తదితరులు