రాష్ట్రీయం

కోస్ట్‌గార్డ్ నౌక సీ-438 జల ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 25: ఇండియన్ కోస్ట్‌గార్డ్ నౌక సీ-438 కాకినాడలో గురువారం జల ప్రవేశం చేసింది. తీర ప్రాంత భద్రత కోసం నిర్మించిన ఈ నౌకను డీజీపీ ఎం.మాలకొండయ్య, కోస్ట్‌గార్డ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా సమక్షంలో లాంఛనంగా జలప్రవేశం చేయించారు. ఈ నౌక కాకినాడ కేంద్రంగా పనిచేయనుంది. తూర్పు తీరంలో జరుగుతున్న స్మగ్లింగ్‌ను అరికట్టడంతోపాటు, అక్రమ చేపల వేటను పసిగట్టడానికి పనిచేస్తుంది. 27.80 మీటర్ల పొడవు, 106 టన్నుల బరువు కలిగిన ఈ నౌక గంటకు 85 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెండు డీజిల్ ఇంజన్‌లు, రెండు వాటర్ జెట్ ప్రొఫెలర్లు కలిగి ఉంది. ఈ నౌక మూడు, నాలుగు రోజులు నిరవధికంగా ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉండడం విశేషం. అత్యాధునిక నేవిగేషన్ సిస్టం కలిగిన ఈ నౌక సముద్రంలో ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ నౌకకు కమాండర్‌గా అసిస్టెంట్ కమాండెంట్ మనీష్‌కుమార్ సింగ్ వ్యవహరిస్తున్నారు.

చిత్రం..చారీ-438 నౌకను పరిశీలిస్తున్న డీజీపీ మాలకొండయ్య తదితరులు