రాష్ట్రీయం

నగరాల్లో నీటి సరఫరాపై ఉన్నతాధికారులకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలకు సంబంధించి జియోమెటిక్స్, సర్వేయింగ్‌లలో తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు చెంది ఉన్నతాధికారులకు మూడు రోజుల శిక్షణ బుధవారం ఇక్కడ ప్రా రంభమైంది. హైదరాబాద్‌లోని ఐఐఎస్‌ఎం (ఇం డియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్) లో ఏర్పాటు చేసిన మూడురోజుల శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులకు ఈ తరహా శిక్షణ తర్వాత ఇస్తారని ఐఐఎస్‌ఎం డిప్యూటీ సర్వేయర్ జనరల్ యు.ఎన్. మిశ్రా ప్రకటించారు. అటల్ మిషన్ ఫర్ రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్సాఫార్మేషన్ (అమృత్) ఉప- పథకం కింద దేశంలోని 500 నగరాలు, పట్టణాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిదశలో టౌన్‌ప్లానర్స్‌కు శిక్షణ ఇ స్తున్నారు.