రాష్ట్రీయం

పవన్ కళ్యాణ్‌పై ఎఫ్‌ఐఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పవన్ అభిమానులు టీవీ 9 కార్యాలయానికి ఫోన్‌చేసి ఆ ఛానల్ సీఈవో రవిప్రకాష్‌ను ఉద్దేశించి ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ ఈ నెల 21వ తేదీన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తరఫున గుండేపల్లి రాజేష్ ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు దర్యాప్తు జరిపిన బంజారాహిల్స్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద పవన్‌కళ్యాణ్‌పై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 469, 504, 506 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ (367/2018)ను నమోదు చేశారు. పవన్ తన ట్విట్టర్‌లో పెట్టిన కామెంట్లు, మీడియా కథనాలను వక్రీకరించి అప్‌లోడ్ చేసిన దృశ్యాలను రాజేష్ పోలీసులకు అందించారు. రవిప్రకాష్‌తో పాటు ఇతర ఉద్యోగులను దూషించిన ఆడియోలను కూడా సమర్పించారు. ఈ ఆధారాలను పరిశీలించిన మీదట కేసు నమోదుచేసినట్టు బంజారాహిల్స్ ఎస్‌ఐ పి దాలినాయుడు తెలిపారు. ప్రాధమిక ఆధారాలతో కేసు నమోదుచేశామని, ఈ కేసును మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టీవీ9, ఎబిన్, టీవీ5, టీవీ9 సీఈవో రవిప్రకాష్ పట్ల తప్పుడు పత్రాలతో ఆయా సంస్థల, వ్యక్తుల ప్రతిష్టను దిగజార్చేందుకు పవన్‌కళ్యాణ్ ,అతని బృందం, అనుచరులు, జనసేన కార్యకర్తలు ప్రయత్నించారని గుండేపల్లి రాజేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడియో, వీడియోలను సాంకేతికతతో మార్చి అసలు వీడియోలు మాదిరి వాటిని ట్విట్టర్ ఇతర సామాజిక మాద్యమల్లో ఉంచారని పేర్కొన్నారు. కొన్ని పదాలు టీవీ 9 ప్రసారం చేసిన కార్యక్రమాల్లో లేకున్నా వాటిని చేర్చి అసలు వీడియో అనుకునేలా దానిని ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీవీ9 కార్యాలయానికి పవన్ అనుచరులు, జనసేన కార్యకర్తలు ఫోన్ చేసి తీవ్రమైన అసభ్య పదజాలంతో తిడుతున్నారని తన ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీసులు తెలిపారు.