రాష్ట్రీయం

ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు తొలి తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 26: బాలలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఇటీవలే ఏర్పాటైన ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు తన తొలితీర్పును వెలువరించింది. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 95 కేసుల్లో విచారణ కొనసాగగా, మూడు కేసుల్లో తుది తీర్పును వెలువరించింది. ఈ మూడింటిలో తొలి కేసుగా పదకొండేళ్ల బాలికను 50 ఏళ్ల వ్యక్తి పలుసార్లు గదిలో నిర్భంధించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో కోర్టు నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమాన విధించింది. గత ఏడాది మే 17న జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదైంది. జరిమాన చెల్లించని పక్షంలో మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.500 జరిమాన చెల్లించాల్సి ఉంటుందని ఫ్రెండ్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఫలక్‌నుమా పోలీసు స్టేషన్‌లో నమోదైన మరో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమాన విధించింది. మూడున్నర ఏళ్ల బాలిక తనకు వరుసకు సోదరుడు అయ్యే 10 ఏళ్ల బాలుడితో కలిసి ఆడుకుంటుండగా ఆ కుటుంబానికి సమీపంలో నివశించే 28 ఏళ్ల వ్యక్తి ఆ ఇద్దరు పిల్లలను తన ఇంటికి పిలిచి తనతో ఓరల్ సెక్స్ చేయాలని కోరడంతో వారిద్దరు తిరస్కరించి అక్కడ నుంచి పారిపోయారు. వారిద్దరు తమ పెద్దలకు జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో తుది విచారణ పూర్తి చేసి నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. మూడో కేసులో బాధితుడు బాలుడు. సికింద్రాబాద్‌కు చెందిన 10వ తరగతి చదువుతున్న బాలుడు (15) తనకు ట్యూషన్ చెప్పే టీచర్‌పై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశాడు. లైంగికంగా తనను ఇబ్బంది పెడుతున్నాడని, లైంగిక దాడి చేస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో కోర్టు విచారణ పూర్తి చేసి నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదు వేల జరిమాన విధించింది. బాలలపై లైంగిక దాడులను అరికట్టేందుకే అమల్లోకి తెచ్చిన ప్రత్యేక చట్టాన్ని అనుసరించి ఈ ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు పరిశోధక అధికారులు, సాంకేతిక నిపుణులు, డాక్టర్ల బృందం మొత్తం 13 మంది అధికారులతో కలిసి విచారణ పూర్తి చేసిన అనంతరం ఈ మూడు కేసుల్లో తీర్పు ఇవ్వడం జరిగిందని ఆ వివరాలను హైదరాబాద్ నగర నేర విభాగం అదనపు పోలీస్ కమిషనర్ షికాగోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.