రాష్ట్రీయం

సివిల్స్‌లో తెలుగు వాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్-2017 తుది ఫలితాల్లో తెలంగాణ అభ్యర్ధి దురిశెట్టి అనుదీప్ జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సివిల్ సర్వీసెస్ -2017 తుది ఫలితాలను ప్రకటించింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన అనుకుమారి మహిళల కోటాలో టాపర్ కాగా, దివ్యాంగుల కోటాలో సౌమ్యా శర్మ టాపర్‌గా నిలిచారు. టాప్ -25 ర్యాంకుల్లో 8 మంది మహిళా అభ్యర్ధులు మంచి ర్యాంకులు సాధించారు. కడపటి వార్తలు అందే సమయానికి తెలుగు రాష్ట్రాల నుండి 34 మంది సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఈసారి ఎక్కువగా తెలంగాణ నుండి సివిల్ సర్వీసులకు ఎంపిక కావడం గమనార్హం. ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన శీలం సాయితేజ 43, నారపురెడ్డి వౌర్య -100, ఎం శే్వత-119, బి.జి దిలీప్-20, ఎస్ అంజలి-26, జ్యోతి కుమారి -53, జి. మాధురి -144, వివేక్ జాన్సన్ -195, వై. అక్షయ్ కుమార్ -624, భార్గవ్ శేఖర్ -816 ర్యాంకులు సాధించారు. మాజీ సిబిఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ కుమారుడు ప్రణీత్ సైతం ఈసారి మంచి ర్యాంకు సాధించాడు. సివిల్స్ -2017కు 7,57,590 మంది దరఖాస్తు చేయగా, 4,56,625 మంది 2017 జూన్ 18న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. అందులో మెయిన్స్‌కు 13,366 మంది అర్హత సాధించారు. వీరికి అక్టోబర్ -నవంబర్ నెలల్లో మెయిన్స్ పరీక్ష జరగ్గా, వౌఖిక పరీక్షకు 2568 మంది అర్హత సాధించారు. వారికి ఈ ఏడాది ఫిబ్రవరి నుండి వౌఖిక పరీక్షలు నిర్వహించి 990 మందిని ఎంపిక చేశారు. అందులో జనరల్ అభ్యర్ధులు 476 మంది, ఒబిసి 275 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 74 మంది ఉన్నారు. జనరల్ కేటగిరిలో ఎంపికైన వారిలో 21 మంది పిహెచ్ అభ్యర్థులున్నారు, ఒబిసి కేటగిరిలో ఐదుగురు , ఎస్సీల్లో ముగ్గురు పిహెచ్ అభ్యర్ధులున్నారు. వీరితో పాటు 132 మందితో కన్సాలిడేటెడ్ రిజర్వు జాబితాను కూడా కమిషన్ పొందుపరిచింది. అందులో జనరల్ 66 మంది, ఒబీసీ 56, ఎస్సీ-09, ఎస్టీ-01 ఉన్నారు. 180 మందికి ఐఎఎస్, 42 మందికి ఐఎఫ్‌ఎస్, 150 మందికి ఐపిఎస్, 565 మందికి సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఎ, 121 మందికి సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-బి కేటాయించేందుకు వీలుగా కేంద్రం ఖాళీలను ప్రకటించింది. ఎంపికైన వారు 990 మంది ఉన్నా, మరో 132 మంది రిజర్వు లిస్టులో ఉన్నారు. వీరందరి నుండి 1058 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉందని యుపీఎస్సీ ప్రకటించింది. ఐఎఎస్‌కు 93 మంది జనరల్, 46 మంది ఒబీసీ, 28 మంది ఎస్సీ, 13 మంది ఎస్టీలు, అలాగే ఐఎఫ్‌ఎస్‌కు 22 జనరల్, 11 ఒబిసి, 7 ఎస్సీ, 2 ఎస్టీ, ఐపిఎస్‌లు 77 జనరల్, 40 ఒబిసి, 23 ఎస్సీ, 10 ఎస్టీలకు అవకాశం దక్కనుంది. ఇద్దరు అభ్యర్ధుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది.

జాతీయ టాపర్ అనుదీప్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దురిశెట్టి అనుదీప్ 2017 సివిల్స్ తుది జాబితాలో జాతీయ టాపర్‌గా నిలిచాడు. మల్లాపూర్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దురిశెట్టి మనోహర్, దురిశెట్టి జ్యోతిల ప్రధమ తనయుడైన అనుదీప్ జాతీయ టాపర్‌గా ఎంపిక కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. 2014 జాతీయ టాపర్ ఇరాసింగాల్ సైతం అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అనుదీప్ 2016లో సివిల్స్ రాయగా ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
వరంగల్ వాసికి ర్యాంకు
సివిల్స్ ఫలితాల్లో వెల్లి అక్షయ్‌కుమార్‌కు 623 ర్యాంకు లభించింది. దీంతో ఆయనకు ఐపిఎస్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ శివునిపల్లి ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ దయాకర్ కుమారుడు అక్షయ్ కుమార్ హన్మకొండ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకూ చదివాడు. భోపాల్‌లోని నిట్‌లో బిటెక్ పూర్తి చేశాడు.