రాష్ట్రీయం

స్వస్తివాచనంతో నృసింహుడి జయంత్యుత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, ఏప్రిల్ 27: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి జయంత్యుత్సవాలకు శుక్రవారం ఉదయం స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. యాజ్ఞికులు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలతో, సన్నాయి మేళాల మధ్య శుద్ధి చేసిన మంత్రజలాన్ని ఆలయ ప్రాంగణంలో చల్లి శుద్ధి చేసి మూడు రోజుల పాటు జరిగే జయంత్యుత్సవాలకు నాంది పలికారు. స్వస్తివాచనం పేరిట ఈ కార్యక్రమాన్ని ఆలయంలో విశ్వక్సేనుడి ఎదుట నిర్వహించారు. స్వామి వారి జయంత్యుత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహించేందుకు రక్షాబంధనం కార్యక్రమం చేపట్టారు. స్వస్తివాచనానికి ముందు వైష్ణవ సంప్రదాయం ప్రకారం పాంచరాత్ర ఆగమశాస్త్రం రీత్యా విశ్వక్సేనుడికి పూజలు జరిపారు. అనంతరం ఆలయ మహా మండపంలో లక్ష కుంకుమార్చన నిర్వహించారు. తదుపరి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవారిని వేంకటపతి అలంకరణలో అత్యంత సుందరంగా పట్టు వస్త్రాలు, వివిధ రకాల పూలమాలలతో తీర్చిదిద్ది అలంకరించిన పల్లకిలో సేవోత్సవం జరిపారు. సాయంత్రం ఆలయంలో మత్య్సగ్రహణం, అంకురారోహణం, మూర్తికుంభ స్థాపన, మూలమంత్ర హవనం, మంత్ర పుష్పములు జరిపి రాత్రి గరుఢ వాహనంపై స్వామి వారి సేవోత్సవం జరిపారు. ప్రధాన అర్చకులు ఎన్.లక్ష్మీనర్సింహచార్యులు, రాఘవచార్యులు, నర్సింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, యాజ్ఞికులు మంగళగిరి ఫణీంద్రచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.