రాష్ట్రీయం

టీచర్ కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే డీఎస్సీ-2018 ద్వారా రాష్టవ్య్రాప్తంగా 10,351 పోస్టులు భర్తీ చేయనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. విశాఖలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డీఎస్సీ-2018కి సంబంధించి జూలై 6న నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆగస్టు 23 నుంచి 30 వరకూ ఆన్‌లైన్ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 15న వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు. డీఎస్సీ-2018లో మరికొంతమంది అర్హులకు అవకాశం కల్పించేందుకు వీలుగా మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. టెట్ పరీక్షకు సంబంధించి మే 4న నోటిఫికేషన్ జారీ అవుతుందని, జూన్ 10 నుంచి టెట్ పరీక్షలు జరుగుతాయన్నారు. టెట్ పరీక్షా ఫలితాలు జూన్ 30న విడుదల చేస్తామన్నారు. పరీక్షలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారానే జరుగుతాయని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని భావించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం డీఎస్సీ-2014 ద్వారా 10వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని గుర్తు చేశారు. డీఎస్సీకి సంబంధించి జిల్లా ఎంపిక సంఘం జూలై 6న నోటిఫికేషన్ జారీ చేస్తుందన్నారు. ఆగస్టు 15 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 23 నుంచి 30వరకూ ఆన్‌లైన్ విధానంలో ప్రతి రోజు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. డీఎస్సీ-2018లో మరికొంతమంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరోసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
10,351 పోస్టుల భర్తీ
డీఎస్సీ-2018 ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, మండల పరిషత్ పాఠశాలల్లో 5,614 పోస్టులు, మున్సిపాలిటీ, నగర పాలక సంస్థల్లో 1,447 పోస్టులతో పాటు 3,290 అందుబాటులోని ఎస్జీటీ,ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, వ్యాయామ, సంగీత, నృత్య ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్టు మంత్రి గంటా వెల్లడించారు. వీటిలో 4,967 ఎస్జీటీ పోస్టులు, 2,978 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 312 భాషా పండితుల పోస్టులు, 1,056 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు, 109 సంగీత, నృత ఉపాధ్యాయ పోస్టులు, మరో 929 మోడల్ స్కూల్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు.
తొలిసారిగా పీఈటీలకు టెట్
ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో తొలిసారి పీఈటీలకు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో ఫిజికల్ లిటరసీకి ప్రాధాన్యత ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్యను తప్పనిసరి చేశామన్నారు. దీనిలో భాగంగా వెయ్యికిపైగా వ్యాయామ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి టెట్‌లో 150 మార్కులకు పరీక్ష ఉంటుందని, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, రాష్టస్థ్రాయిలో పతకాలు సాదించిన అభ్యర్థులకు గరిష్టంగా 30 మార్కుల వెయిటేజీ కల్పిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పీఈటీలో వెయిటేజీతో పాటు భాషా ప్రావీణ్యతకు సంబంధించి 50 మార్కులు, వ్యాయామ విద్యకు సంబంధించి 70 మార్కులకు పరీక్ష ఉంటుందన్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల మేరకు సంవత్సరానికి రెండు విడతలుగా టెట్ పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. డీఎస్సీలో భౌతిక అంశాలకు ప్రాధాన్యత నిస్తూ దీనిలో 30 మార్కులు కేటాయిస్తున్నట్టు మంత్రి గంటా వెల్లడించారు.
నేడు టెన్త్ ఫలితాలు
పదవ తరగతి పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల చేయనున్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలు విడుదల చేస్తారు.