ఆంధ్రప్రదేశ్‌

ఆస్తుల పంపకాలపై స్పష్టత వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. హైదరాబాద్‌లోని సచివాలయ భవనం, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, సిబ్బంది క్వార్టర్లను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇంకా విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని వివిధ సంస్థల విభజన, తదితర అంశాలు కొలిక్కిరాని నేపథ్యంలో హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మేరకు రెండు రాష్ట్రాల మధ్య వివిధ సంస్థల ఆస్తులు, నగదు, సిబ్బంది పంపకాలు జరగాల్సి ఉంది. ఈ వ్యవహారాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల మంత్రులతో గవర్నర్ ఒక కమిటీని నియమించారు. కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ ఆశించిన మేర పురోగతి సాధించలేకపోయింది. 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలు, 10వ షెడ్యూల్‌లో 142 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు సంబంధించి దాదాపు 8వేల కోట్ల రూపాయలు పంపకాలు జరగకపోవడంతో నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. 9వ షెడ్యూల్‌లోని సంస్థల ఆస్తుల విలువ దాదాపు 1.4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. 10వ షెడ్యూల్‌లోని ఆస్తుల విలువ దాదాపు 38,700 కోట్ల రూపాయలు. ఈ వ్యవహారం నాలుగేళ్లుగా కొలిక్కిరాలేదు. తాజాగా పంపకాల వ్యవహారం కొలిక్కి రాకపోయినప్పటికీ సచివాలయం, క్వార్టర్లను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఆస్తుల పంపకాలకు సంబంధించి మిగిలిన అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని, తరువాత తెలంగాణ అభ్యర్థనను పరిశీలించవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈనేపథ్యంలో దాదాపు మూడు నెలల తరువాత జరుగుతున్న సీఎస్‌ల స్థాయి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.