రాష్ట్రీయం

బాబువన్నీ మోసాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 29: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను నాలుగేళ్లుగా ఖూనీచేసి ప్రజలను అన్నివిధాలా మోసం చేసి, అన్నీ ‘420’ పనులు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే హోదా కోసం ధర్మపోరాటం పేరుతో దీక్షల నాటకాలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. బాబుకు ఏమాత్రం దమ్మున్నా తనకు నేరుగా సమాధానం చెప్పాలంటూ ఏడు ప్రశ్నలు సంధించారు. టీటీడీ బోర్డులో బీజేపీకి చెందిన మహారాష్ట్ర మంత్రి భార్యకు స్థానం కల్పించి తిరుపతిలో అదే బీజేపీపై నిరసన దీక్ష చేపట్టటం నయవంచన కాదా అని నిలదీశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగం గా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న జగన్ ఆదివారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రం పామర్రులో జరిగిన బహిరంగ సభలో దాదాపు గంటా 20 నిముషాలకు పైగా ప్రసంగించారు. భారీగా ప్రజలు తరలిరావటంతో పామర్రు కిక్కిరిసిపోయింది. గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలంటూ ప్రచారం చేసుకుని నేడు జాబు రావాలంటే బాబు పోవాలి
అన్నట్టుగా పరిస్థితిని మార్చాడని సీఎంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20లక్షల కోట్ల పెట్టుబడులు రాగా 40లక్షల ఉద్యోగాలు వచ్చాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్న చంద్రబాబును నిరుద్యోగులు నమ్ముతారా? అని ప్రశ్నించారు. కేంద్రం కేసులు పెడితే ప్రజలు అండగా నిలవాలంటున్నారని విమర్శించారు. నాలుగేళ్ల క్రితమే హోదా వచ్చి ఉంటే వెల్లువలా ఉద్యోగాలు వచ్చి ఉండేవని, బాబు చేసిన తప్పిదం వల్ల అవేవీ రాకుండా పోయాయన్నారు. మోసకారి, వెన్నుపోటుదారుడైన బాబు గాంధీని చంపిన గాడ్సే మాదిరిగా దీక్ష సాగిస్తుండటం దారుణమన్నారు. ఈసందర్భంగా బాబుకు జగన్ ఏడు ప్రశ్నలు సంధించారు. దమ్ముంటే వీటికి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. 2014 డిసెంబర్ 31 వరకు ప్రణాళికా సంఘం అమల్లోనే ఉన్నప్పటికీ బాబు కనీసం లేఖ రాయలేదని, ప్రణాళికా సంఘాన్ని కలవలేదని అన్నారు. 2016లో జైట్లీ ప్రకటనను స్వాగతించి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు? 40 లక్షల ఉద్యోగాలు వాస్తవమా? అని ప్రశ్నించారు. హోదా కోసం విపక్షాలు పోరాడుతుంటే పోలీసుల సాయంతో శిబిరాలు ఎత్తివేయించి బస్సులు తిప్పించి విద్యార్థులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని చెప్పింది వాస్తవం కాదా? అని నిలదీశారు. తాము కేంద్రంపై అవిశ్వాసం పెట్టకపోతే బాబు పెట్టేవాడా? అని ప్రశ్నించారు. ఆందోళన వద్దు నల్లబ్యాడ్జీలతో నిరసన చేస్తే చాలన్నారని, అలాచేస్తే హోదా వస్తుందా? అని జగన్ ప్రశ్నించారు. తిరుపతిలో ధర్మపోరాటం అంటూ టీటీడీ బోర్డులో బీజేపీ మంత్రి భార్యకు స్థానం కల్పించటం మోసం కాదా? అన్నారు. ఇన్నివిధాలుగా అన్యాయాలు, మోసాలు చేస్తున్న చంద్రబాబును క్షమిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఇంటికి కిలో బంగారం ఇస్తానంటాడని, బోనస్‌గా ఇంటికో బెంజి కారంటాడని, అయినా ప్రజలు నమ్మరని తెలిసి ప్రతి ఓటుకు మూడువేలు ముందుగా ఇస్తాడన్నారు. అది దోపిడీ సొమ్మే కాబట్టి ఐదువేలు తీసుకోండంటూ.. ఇలా మోసం చేసేవారిని, అబద్ధాలు చెప్పేవారిని బంగాళాఖాతంలో కలిపేసేలా బుద్ధి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు. మాట నిలుపుకోని నాయకుడు ఇంటికి పోవాలన్నారు. పేదలకు అన్నిరకాల వైద్యసేవలందేలా మహానేత వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అమలుచేస్తే బాబు దానికి తూట్లు పొడిచారన్నారు. మూగ, చెవుడు ఆపరేషన్లు తొలగించాడని, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ అక్కడ చికిత్స చేయించుకునేవారికి పథకాన్ని వర్తింపచేయటం లేదని, ఇలా అనేక దారుణాలు చేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు చేస్తామని, కేన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారికి 10వేల రూపాయల పింఛన్ కూడా ఇస్తామని జగన్ భరోసా ఇచ్చారు. పామర్రు నియోజకవర్గంలో బాబు చేసిందేమీ లేదని, అయితే లక్షల టన్నుల ఇసుక, మట్టిని మాత్రం తన అనుయాయులు తరలించుకునేలా తగిన ఏర్పాట్లు చేశారన్నారు. ఇక్కడి ఫ్లోరైడ్ సమస్య బాబుకు ఏమాత్రం పట్టలేదన్నారు.

చిత్రం..కృష్ణా జిల్లా పామర్రు బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్