రాష్ట్రీయం

సామాన్యులకూ ఐఏఎస్ సాధ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, ఏప్రిల్ 29: అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీస్ ఉద్యోగాలు ఉన్నత వర్గాల పిల్లలకు మాత్రమే సొంతం కాదని, దృఢ సంకల్పం, లక్ష్యం ఉం టే గ్రామీణ ప్రాంతాల సామాన్యులకు కూడా సాధ్యమేనని 2017 సివిల్స్ ఆలిండియా టాపర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అనుదీప్ మాట్లాడా రు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులకు ఎం పిక కావడం డబ్బున్న వర్గాలు, బ్యూరోక్రాట్ల పిల్లలకే సొంతం కాదని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రతిభావంతులయన సామాన్యు లు కూడా పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే ఈ సర్వీసులకు ఎంపిక కావొచ్చని అన్నా రు. 2017సివిల్స్‌లో ఆలిండియా టాపర్‌గా నిలువడం తన తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని అన్నారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల బంగారు భవితవ్యానికి బాటలు వేసి ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే తపనతో తమవంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని పేర్కొన్నారు. ఆ కలల స్వప్నం నిజం చేసుకునే బాధ్యతతో యువత మసలుకోవాలని, ఆ దిశగా చదువు కొనసాగించాలన్నారు. ప్రతి వ్యక్తికి అవకాశా లు వస్తాయని ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న వారే విజేతగా నిలుస్తారన్నారు. యువత కాలక్షేపం కోసం సమయాన్ని వృథా చేయకుండా కష్టమైనా ఇష్టపడి చదివితే ఏ రంగంలోనైనా అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం సా ధ్యమవుతుందన్నారు. విద్యకు కుల, మత, వర్గ్భేదాలంటూ ఉండవని, సాధించిన ఫలితమే సమాజం ముందు నిలుస్తుందని అన్నా రు. సివిల్స్ ఆలిండియా టాపర్‌గా నిలిచిన తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ఐఏఎస్ అధికారిగా భాగస్వామ్యం కావడానికి మించిన ఆనందం మరేముంటుందంటూ, ఐఏఎస్ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటున్నట్ట్లు అనుదీప్ స్పష్టం చేశారు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకోవడం భారత దేశ గొప్పతనానికి, ఐక్యతకు నిదర్శనమని చాటిచెబుతూ సివిల్స్ ఆలిండియా టాపర్‌గా నిలిచిన తనకు స్వగ్రామానికి చేరుకోగానే ఘనస్వాగతం పలుకుతూ వారే ఐఏఎస్ సాధించినంత గా ఆనంద పడడం చూసి తన ఆనందానికి అ వధులు లేకుండాపోయాయన్నారు. తన తల్లిదండ్రులు సామాన్య, మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారైనా తనతో పాటు సోదరుడికి మంచి చదువులు చెప్పించారన్నారు. తాను సాధించిన ఈ ఫలితం యువతరానికి ఆదర్శం కావాలని కోరుకుంటున్నానని అనుదీప్ అన్నారు. అనుదీప్ తల్లిదండ్రులు మనోహర్- జ్యోతి మాట్లాడుతూ తమ తనయుడు అనుదీప్ సాధించిన ఘనత దేశ వ్యాప్తం కావ డం పట్ల చెప్పలేనంత ఆనందంగా ఉందని, ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు సాధించిన ఘ నత కన్నా మించిన ఆనందం మరొకటి లేదంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఈ జన్మకు ఇంతకన్నా మరొకటి సాటిరాదన్నారు. తనయుడు అనుదీప్ సాధించిన ఫలితం తమ ను ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కించిందని ఆనందం వ్యక్తం చేశారు.

చిత్రం..జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతున్న
సివిల్స్ ఆలిండియా టాపర్ దురిశెట్టి అనుదీప్