రాష్ట్రీయం

సొంతింటి కల నెరవేరుస్తా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చంద్రన్న బీమా కార్మిక కుటుంబానికి శ్రీరామరక్ష * మేడే వేడుకల్లో స్పష్టం చేసిన సీఎం
విజయవాడ, మే 1: ప్రతి కార్మికుడి సొంతింటి కల నెరవేర్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు మేడే నుంచే అంకురార్పణ చేయాలని మంగళవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన మేడే దినోత్సవం సందర్భంగా స్పష్టం చేశారు. 1990వ దశకంలో మొదలైన సరళీకరణ, ప్రపంచీకరణ విధానాల నేపధ్యంలో ప్రైవేటీకరణ పెరగటంతో అసంఘటిత కార్మికుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5కోట్ల మంది జనాభా ఉంటే ఇందులో 2.50 కోట్ల మంది అసంఘటిత కార్మికులుగా ఉన్నారన్నారు.
అసంఘటిత కార్మికులు అంటే భవనాల నిర్మాణంలో, ఫ్యాక్టరీల్లో, ఇళ్లల్లో పనిచేసేవారన్నారు. మేడే దినోత్సవం సందర్భంగా కార్మికులకు సంఘీభావం తెలియజేయడమే కాకుండా వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాముఖ్యం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కార్మికులు, యజమానులు కలిసికట్టుగా ఉంటేనే సంపదను సృష్టించడం సాధ్యమవుతుందన్నారు. శ్రామికులతో సరిగ్గా పని చేయించగలిగేదే ఉత్తమ యాజమాన్యం అవుతుందన్నారు. మంచి శ్రామికులు ఎవరంటే ఫ్యాక్టరీ అభివృద్ధికి పనిచేస్తూ సహకరించేవారన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంక్షేమం గురించి యాజమాన్యాలు పట్టించుకుంటున్నాయి కాబట్టే ధర్నాలు, సమ్మెలు జరగడం లేదన్నారు. కార్మికుల్లో సాంకేతిక అభివృద్ధి జరిగి నైపుణ్యం పెంచుకుంటే పరిశ్రమలో శాంతి వస్తుందన్నారు. రవాణా రంగంలో జరుగుతున్న ప్రమాదాల వల్ల కుటుంబాలు వీధిన పడటం దగ్గరగా గమనించడం వల్లే చంద్రన్న బీమా తీసుకువచ్చానన్నారు. రాష్ట్రంలో 2.13 కోట్ల మంది అసంఘటిత కార్మికులు చంద్రన్న బీమాలో నమోదు చేసుకున్నారన్నారు. చంద్రన్న బీమా ద్వారా క్లెయిమ్‌ల పరిష్కారంలో సెర్ప్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని కొనియాడారు. కార్మిక చట్టాలతోపాటు తనిఖీలను కూడా
ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చామన్నారు. పారిశ్రామికవేత్తలు వేధింపులకు గురికాకుండా అంతా ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. 21 రోజుల్లోనే పరిశ్రమల అనుమతులు ఇస్తున్నామని, వీటిని ఇంకా తగ్గించి 10 రోజుల్లో అనుమతులు ఇచ్చేలాగా చూస్తున్నామన్నారు. విద్యుత్ శాఖలో సంస్కరణలు తమ ప్రభుత్వ హయాంలోనే తీసుకువచ్చామన్నారు. భవిష్యత్‌లో కరెంట్ చార్జీలు పెంచబోమని, వీలయినంత మేర తగ్గిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేడే ప్రతిరూపంగా ఉండాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ రాష్ట్భావృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రపంచం అంతా పెట్టుబడుల కోసం దావోస్ తదితర ప్రాంతాల్లో తిరిగానన్నారు. దాని ఫలితంగా 2,788 ఎంవోయూలు కుదిరాయని, 16లక్షల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వీటివల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరికీ పని కల్పించి వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అండదండలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూస్తున్నామని అడిగిన వారందరికీ గ్యాస్ ఇచ్చామని, 100 శాతం ఓడీఎఫ్ రాష్ట్రంగా సాధించేందుకు సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో నిర్మిస్తున్నామన్నారు. పరిశ్రమలు పెట్టేవారికి భూమి ఇవ్వడంతోపాటు నీటి వసతిని కూడా అందిస్తున్నామన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ ప్రారంభించడానికి వచ్చేటప్పటికి నీళ్లు లేవని, ఆరు నెలల్లో నీటి సదుపాయం కల్పిస్తామనే హామీ మేరకు గొల్లపల్లి రిజర్వాయర్‌లో నీటిని నిల్వ ఉంచామన్నారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్స్ పరిశ్రమలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని తెలిపారు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు 1140 కోట్ల చంద్రన్న బీమా కింద ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఈఎస్‌ఐ ఆసుపత్రులకు 80 కోట్ల రూపాయలతో వసతులు కల్పిస్తామని, ఈ సంవత్సరం నుంచే వాటిని అమల్లోకి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో 79 ఐటీఐలు ఉన్నాయని ఇందులో 40వేల మంది విద్యార్థులు చదువుతున్నారని వీటిని మోడ్రన్ ఐటీఐలుగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తామన్నారు. ఇండస్ట్రీలు క్షేత్రస్థాయికి అనుసంధానం కావాలని అప్పుడే పరిశ్రమకు కావాల్సిన విద్యార్థులు నైపుణ్యంతో లభిస్తారన్నారు. జీఎస్టీ, డీమోనటైజేషన్ వల్ల సూరత్, గుజరాత్ పట్టణాల్లో నాలుగు లక్షల మంది ఉద్యోగాలు పోయాయని, కొత్త పాలసీ వల్ల ఉద్యోగాలు పెరగాలి గాని, పోవడం అనేది మంచిది కాదని, పాలసీని సమర్ధవంతంగా అమలు చేయకపోతే మనం దెబ్బతింటామన్నారు. కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఒకే వేదికగా కార్మికులు, యాజమాన్యాలు మేడే వేడుకలు జరుపుకోవడం మంచి పరిణామమన్నారు. రాష్ట్రంలో కార్మికులకు సంబంధించి 25 ఈఎస్‌ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని, ఇందులో మూడు ప్రారంభమయ్యాయన్నారు. కార్మికులకు వైద్యం అందించడంలో సహకరించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా శ్రమశక్తి అవార్డులు, బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులు బహూకరించారు.