రాష్ట్రీయం

అటెండరా.. అపర కుబేరుడా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నెల్లూరు రవాణా శాఖ ఉద్యోగి ఇంట్లో బంగారు ఖజానా
నెల్లూరు, మే 1: ఆయనొక మామూలు అటెండర్ స్థాయి ఉద్యోగి. అయితే అవినీతితో అక్రమ ఆస్తులు కూడబెట్టడంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. 36 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ తాను మొదట చేసిన స్థాయి ఉద్యోగిగానే ఇప్పటికీ ఉంటూ ప్రమోషన్లు కూడా తన అవినీతికి అడ్డమని భావించి తృణప్రాయంగా వదిలేసిన ఘనుడు. నెల్లూరు రవాణా ఉప కమిషనర్ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె నరసింహారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఏసిబి అధికారులు మంగళవారం ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో ఇంట్లో బయటపడిన ఆస్తులు, బంగారు ఆభరణాలు చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారంటే సదరు ఉద్యోగి ఏ స్థాయిలో సంపాదించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. బహిరంగ మార్కెట్‌లో ఆయన వద్ద అధికారులు ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.80కోట్లకు పైమాటే. నెల్లూరు ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న కె నరసింహారెడ్డికి చెందిన నెల్లూరులోని ఆయన నివాసంతో పాటు నగరంలోని అతని స్నేహితుల ఇళ్లలోనూ, విజయవాడలోని నరసింహారెడ్డి బంధువుల ఇళ్లలోనూ మంగళవారం విజయవాడ ఏసిబి డిఎస్పీ రమాదేవి నేతృత్వంలోని అధికారుల బృందం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ కూడలి సమీపంలోని ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఆయన ఆస్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఏసిబి అధికారులు తెలిపిన సమాచారం మేరకు- 50 ఎకరాల వ్యవసాయ భూమి, నెల్లూరు నగరం చుట్టుపక్కల 18 ఫ్లాట్లు, మూడంతస్తుల భవనం, రెండు కేజీల బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు. భూములకు సంబంధించిన పత్రాలతో పాటు ఇంట్లో రూ.7.50లక్షల నగదును కూడా గుర్తించిన ఏసిబి అధికారులు అంతటినీ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నెల్లూరు నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 222 చ.గజాల స్థలం, నగర శివార్లలో సుమారు 4 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు కూడా అధికారులకు చిక్కాయి. అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.80కోట్ల వరకూ ఉంటుందని అంచనా. వీటితో నరసింహారెడ్డి, అతని కుమార్తెల పేరిట నెల్లూరు కో ఆపరేటివ్ బ్యాంక్‌లో ఉన్న రెండు లాకర్లను తెరవాల్సి ఉందని ఏసిబి డి ఎస్పీ రమాదేవి తెలిపారు. 1982లో ఉద్యోగంలో చేరిన నరసింహారెడ్డి తన 36 ఏళ్ల ప్రభుత్వ సర్వీసులో నెల్లూరు జిల్లాకే పూర్తిగా పరిమతమవడం విశేషం. తనకు ఉద్యోగరీత్యా ప్రమోషన్లు వచ్చినప్పటికీ తిరస్కరించి జిల్లాలోని ఆత్మకూరు, గూడూరు, నెల్లూరు రవాణా కార్యాలయాల్లోనే ఉంటూ జిల్లాకే పరిమితమయ్యారు. రవాణా శాఖలో ఎంతటి పనయినా ఏ స్థాయిలోనైనా చేయగలరనే పేరు నరసింహారెడ్డికి ఉంది. ఈ దాడుల్లో విజయవాడ ఏసీబీ డి ఎస్పీ రమాదేవితో పాటు ఏసిబి సి ఐ శ్రీహరిబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.