రాష్ట్రీయం

స్థానిక పోరుకు మేము సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ప్రభుత్వం అంగీకరిస్తే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నట్టు ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కాలపరిమితి వచ్చే ఆగస్టుతో ముగుస్తోందన్నారు. ఈలోగా వీటికి ఎన్నికలు జరగాల్సి ఉందని, రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరిగా జరగాల్సి ఉందన్నారు. లోక్‌సభ, శాసన సభలకు ప్రతి ఐదేళ్లకోసారి ఠంఛనుగా ఎన్నికలు జరుగుతున్నాయని, అదేవిధంగా స్థానిక సంస్థలకూ సకాలంలో ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. వాస్తవంగా 2018 జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించామని, అయితే ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు, చేర్పులు తేవాలని నిర్ణయించడంతో ముందుకు వెళ్లలేకపోయామన్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రకటించామని, జాబితాల్లో మార్పులు, చేర్పుల తర్వాత ఈనెల 17న తుది జాబితా సిద్ధం చేస్తామన్నారు. తుది జాబితాలను రూపొందించగానే అన్ని గ్రామ పంచాయతీల్లో వెల్లడిస్తామన్నారు. ఓటర్ల తుది జాబితా వెల్లడికాగానే ప్రభుత్వం రిజర్వేషన్లపై చర్చించి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏయే పంచాయతీ సర్పంచ్ స్థానాలు,
వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేయాలో నిర్ణయించాల్సి ఉందన్నారు. ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత 15 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయవచ్చని, గతంలో ఇలా చేశారని నాగిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేస్తే, జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో పంచాయతీలకు ఎన్నికలు సులువుగా జరుపుతామన్నారు. ఎన్నికల నిర్వహణకోసం తాము ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాశామని తెలిపారు. రాష్ట్రంలో 12,750 గ్రామపంచాయతీలు ఉన్నాయని, వీటికి మూడు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తామని నాగిరెడ్డి తెలిపారు. పోలింగ్ కోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాల సహకారంతో లక్ష బ్యాలెట్ బాక్స్‌లను సేకరించామని, పోలింగ్ కోసం బ్యాలెట్‌పేపర్లనే వాడుతున్నామని వివరించారు. ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 120 కోట్ల రూపాలను బడ్జెట్‌లో కేటాయించిందన్నారు.
ఎంపిపి, జెడ్పీలకు ఏడాది సమయం
మండలప్రజాపరిషత్ (ఎంపిపి), జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉందని వచ్చే సంవత్సరం వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మన సమాజంలో స్థానిక సంస్థలకు ఎంతో ప్రాధాన్యత ఉందని నాగిరెడ్డి తెలిపారు. రాజ్యాంగానికి జరిగిన 73, 74 వ సవరణలతో స్థానిక సంస్థల్లో మూడంచెల వ్యవస్థ వచ్చిందని గుర్తు చేశారు. తాగునీరు, మురుగునీటి పారుదల, రోడ్లు, పర్యావరణం, వీధిదీపాలు తదితర వౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత పంచాయతీలు, మున్సిపాలిటీలపై ఉందని గుర్తు చేశారు. ఈ వౌలిక సదుపాయాలే చాలా ప్రాంతాల్లో నేటికీ సరిగ్గా లేవని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యం వీటిపైనే ఆధారపడి ఉంటుందని, అందువల్ల సకాలంలో ఎన్నికలు జరిగితే ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ద తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.