రాష్ట్రీయం

ఎస్టీల అణచివేతకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 1: కేసీఆర్ పాలనలో గిరిజనుల భూములు లాక్కొని వారిని అణిచివేతకు గురిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎంఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన చలో కామారెడ్డి గిరిజన కాంగ్రెస్ సదస్సులో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావంతో ప్రతి తండాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన గిరిజనులు కలలు కల్లలయ్యాయన్నారు. మాయమాటలు చెప్పి గిరిజనుల జీవితాల్లో తెలంగాణ సర్కార్ చీకటి నింపిందని ఆరోపించారు. ఆరు శాతం ఉన్న రిజర్వేషన్‌ను 12 శాతం చేస్తానని బూటకపు హామీలతో మోసం చేశారని ఆరోపించారు. రాజకీయ నేతల్లో కేసీఆర్ అంతటి మోసగాడు ఎవరూ ఉండరని, ఇకముందూ ఎవరూ ఉండరన్నారు. గిరిజనుల భూములు లాక్కోవడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్, ఎవరికిచ్చారో చూపించాలన్నారు. పంటలు పండించిన రైతులకు సంకేళ్లు వేసిన ఘనత తెరాస సర్కాకే దక్కుతుందన్నారు. గిరిజనులకు ఇళ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. గిరిజనులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించనున్నామని, వరి, మొక్కజొన్న, సజ్జ పంటకు కనీస మద్దతు ధర 2 వేల కంటే ఎక్కువ, పత్తికి 6 వేల కంటే ఎక్కువ, మిర్చి, పసుపుకు 10 వేల కంటే ఎక్కువ, పప్పు్ధన్యాలకు 7 వేలకు పైగా ధర కల్పించి ఆదుకుంటామన్నారు. మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలు, వడ్డీమాఫీ, అభయహస్తం, పెన్షన్‌లను గత ప్రభుత్వం అందజేస్తే కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అభయహస్తంలో వెయ్యి రూపాయలు పెంచుతామన్నారు. కేసీఆర్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. శాసనసభ ప్రతిపక్షనేత నేత కే. జానారెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ ఆలీ, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు మాట్లాడారు.