రాష్ట్రీయం

పాలిసెట్‌లో 92.21 శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: తెలంగాణ పాలిసెట్ ఫలితాల్లో 92.21 శాతం ఉత్తీర్ణులయ్యారని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ప్రవేశపరీక్షలో ఏడుగురికి సమాన మార్కులు రావడంతో ఏడుగురికి తొలి ర్యాంకును ఇచ్చారు. మరో తొమ్మిది మందికి తర్వాతి స్థానంలో సమా న మార్కులు రావడంతో వారందరికీ 8వ ర్యాంకు కేటాయించారు. తొలి ర్యాంకు సాధించిన వారిలో నల్లబెల్లి హర్షి త్ (నర్సంపేట), భూక్య తరుణ్(మామిళ్లగూడెం), పోలిశెట్టి వర్షశ్రీ (కోదాడ), గూడి అక్షయ్ (మహబూబ్‌నగర్), ఆకుల శ్రీవత్మిక (నాగర్‌కర్నూలు), తాలిశెట్టి నర్సింహస్వామి (సూర్యాపేట), నోముల వంశీ మాధవ్ (సూర్యాపేట) ఉన్నారు. ఇక 8వ ర్యాంకు సాధించిన వారిలో గ్రంథల శ్రీ సాయి హర్షిత (సరూర్‌నగర్), కట్టా జయంత్‌రెడ్డి (కోదాడ) , సద్దల వివేక్(వనపర్తి), జలగం సాయి కిరణ్ (సూర్యాపేట), పోదుగు దీపిక (సూర్యాపేట), వాలదాస్ ఉదయ్ కిరణ్ (సూర్యాపేట), గూడూరు యశ్వంత్ (సూర్యాపేట), కమ్మరి ప్రవీత్ చారి (అమరచింత) దక్కించుకున్నారు. టా ప్ 15 ర్యాంకర్లలో ఆరుగురు సూర్యాపేట వాసులే ఉండ టం గమనార్హం. మంగళవారం రాత్రి నవీన్ మిట్టల్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 21న ప్రవేశపరీక్ష నిర్వహించి రికార్డు సమయం లో ఫలితాలను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 1,25,063 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 1,21,422 మంది హాజరయ్యారని, అందులో 1,12,010 మంది అర్హత సాధించారని ఆయన చెప్పారు. 74,224 మంది బాలురు హాజరుకాగా, వారిలో 67,499 మంది అర్హత సాధించారని, 47,918 మంది బాలికలు హాజరుకాగా వారిలో 45,511 మంది బాలికలు అర్హత సాధించారని చెప్పారు. బాలురు 90.94 శాతం, బాలికలు 94.31 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. పాలిసెట్‌లో కనీసం 30శాతం మార్కులు అంటే 36 మార్కులు సాధించిన వారికి ర్యాంకులు ఇచ్చామని, అయి తే ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కటాఫ్ మార్కుల నిబంధన లేదని అన్నారు. సమాన మార్కులు వస్తే మాథ్స్, ఫిజికల్ సైన్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు.
బ్యాక్‌లాగ్ ఖాళీల్లో అడ్మిషన్లు..
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో ఏర్పడిన ఖాళీల్లోనూ, కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 8వ తరగతిలో చేరేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మే 15వ వరకూ దరఖాస్తులు స్వీకరించి, జూన్ 3న వారికి ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఇంటర్మీడియట్‌లో చేరేందుకు జెసి-సెట్-2018కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. మే 7వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రవేశపరీక్ష మే 28న జరుగుతుందని చెప్పారు.
ఎస్సార్ జెఈఈలో తెలుగు విద్యార్థులకు ర్యాంకులు..
ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ ఇంజినీరింగ్ యూజీ కోర్సు లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్షలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థి కేవీఆర్ హేమంత్‌కుమార్ చోడిపిల్లి నాలుగో ర్యాంకు సా ధించగా, తెలంగాణకు చెందిన రోహిత్ చిలుక ఐదో ర్యాం కు సాధించాడు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షలో యుపికి చెందిన ఉజ్వల్ సింగ్ టాపర్‌గా నిలువగా, తమిళనాడుకు చెందిన నరీన్ సాయిరామ్ ఐయ్యర్ రెండో ర్యాంకును, కర్నాటకకు చెందిన గాయత్రీ వెంకటేశ్ , ఆరో ర్యాంకు తమిళనాడుకు చెందిన ఎస్ అభిషేక్, రాజస్థాన్‌కు చెందిన హర్షిత్ కుమార్ బారన్‌వాలాకు ఏడో ర్యాంకు యూపీకి చెందిన కే నిఖితకు 8వ ర్యాంకు వచ్చింది.