రాష్ట్రీయం

ఫ్రంట్ వెంటే ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: కేంద్రంలో బీజేపీని నిలువరించగలిగే శక్తి ఒక ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది. ఆ దిశగా దేశగా టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తమ పూర్తి సహకారం, మద్దతు ఉంటుందని సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దేశ ప్రజలకు బిజేపి ఇచ్చిన హామీల జాబితా చాతడంతా ఉన్నప్పటికీ ఏ ఒక్క హమీని నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. రైతులు, మహిళలు, దళితులు ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదని, అన్ని వర్గాల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయన్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో మార్పు కోసం ఇక్కడి నుంచే బీజం పడిందని, ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ ప్రయత్నాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. టిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబోతున్న ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించడానికి బుధవారం హైదరాబాద్ వచ్చిన అఖిలేష్ యాదవ్
ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఏ రాష్ట్రానికి ఇచ్చిన హామీని కూడా బిజేపి నిలబెట్టుకోలేకపోయిందన్నారు. తాను కేసీఆర్‌తో జరిపిన చర్చలను రాజకీయ కోణంతో కాకుండా ప్రగతిశీల కోణంతో చూడాలన్నారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందని బిజేపి సర్కార్ చెప్పింది, దాని వల్ల ఏమైనా మేలు జరిగిందా? అని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దేశంలో ఆర్థికాభివృద్ధి ఆశించిన మేరకు జరుగలేదన్నారు. గత ప్రభుత్వాలు ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయాయన్నారు. ఈ కారణంగానే ప్రజలు ఇప్పటికీ సాగు, మంచినీటి సమస్యలతో సతమతవౌతున్నారన్నారు. దేశంలో ప్రతిభకు కొదవలేదనీ, దేశ యువత ఇతర దేశాలకు వెళ్లి ఎంతో రాణిస్తున్నారన్నారు. అన్ని వనరులున్నా దేశ పురోగతి మాత్రం ఆశించిన మేరకు జరుగడం లేదని అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే దేశ రాజకీయాల్లో మార్పు అవసరమని, ఈ దిశగా కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై విస్తృత చర్చలు జరిపామని భవిష్యత్ కార్యాచరణపై ఇక ముందు కూడా తమ చర్చలు కొనసాగుతాయన్నారు.

ఫ్రంట్ చిల్లర రాజకీయాల కోసం కాదు
‘కొంత మంది తెలిసో, తెలియకో 2019 ఎన్నికల్లో అధికారం కోసమో, పదవుల కోసమో ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్‌గా భావిస్తున్నారు. దీనిని చిల్లర రాజకీయాల కోణంలో కాకుండా దేశ హితం కోరి చేస్తోన్న ప్రయత్నంగా చూడాలి’ అని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తమ ప్రయత్నాన్ని మీడియా థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్‌గా అభివర్ణించడం సరికాదని ఆయన హితవు పలికారు. తొందర, తత్తరపాటు ఎందుకు? రెండు, మూడు నెలలు ఆగితే స్పష్టమైన విధానంతో ఫ్రంట్‌ను ప్రజల ముందుకు తీసుకోస్తామని కేసీఆర్ న్నారు. దేశ రాజకీయ ప్రక్రియలో గుణాత్మక మార్పు తీసుకరావాలంటే ఎంతో ప్రయాసతో కూడుకుంది తప్ప ఆశామాషి వ్యవహారం కాదన్నారు. ఎంతో శ్రమతో కూడుకుందన్నారు. ఇంకా ఎన్నో పార్టీలను కలవాల్సి ఉందని, అందరితో మాట్లాడి ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఇది ఏ ఒక్కరో చేసే పనికాదన్నారు. తమ ప్రయత్నానికి ఇది ప్రారంభం మాత్రమేనని, ఇంకా ఎలా ముందుకు వెళ్లాలి, ఏ చేయాలి అనే దానిపై చాలా మందితో చర్చించాల్సి ఉందన్నారు. ఈ ప్రయత్నాల్లో ఎవరు కూడా తమకు అంటరాని వారులేరన్నారు. అందరితో చర్చించిన తర్వాతనే పూర్తిస్థాయి ఎజెండాతో రెండు, మూడు నెలల్లో ప్రజల ముందుకు వస్తామన్నారు. అప్పటి దాకా వేచి చూడాలని, తొందరపడి దీనిని మూడవ ఫ్రంట్, నాలుగవ ఫ్రంట్‌గా అభివర్ణించవద్దని మీడియాకు కేసీఆర్ సూచించారు. మున్ముందు తాను జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నానని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రెండు, మూడు దశాబ్దాల కిందట భారతదేశాని కంటే ఎంతో వెనుకబడి ఉన్న చైనా, కొరియా, సింగపూర్, మలేషియా ప్రస్తుతం ఎంతో ఆర్థికాభివృద్ధి సాధించగలిగాయన్నారు. అన్ని వనరులు ఉండి కూడా భారత్ ఎందుకు వెనుకబడడానికి గత ప్రభుత్వాలు కారణం కాదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకరావాలన్న ఆలోచనలోంచి జనించిందే ఫ్రంట్ అన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, పరివర్తనను తీసుకరావడానికి నెల రోజులుగా తన ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. దీంట్లో భాగంగానే కోల్‌కత్తా వెళ్లి మమత బెనర్జీతో, బెంగళూరు వెళ్లి దేవెగౌడతో, చెన్నై వెళ్లి డిఎంకేతో చర్చించిన సారాంశాన్ని ఎప్పటికప్పుడు అఖిలేష్‌తో పంచుకుంటున్నట్టు కేసీఆర్ వివరించారు.